News September 13, 2024
ఆర్మూర్: 108 రకాల నైవేద్యాలతో వినాయకుడి పూజ
ఆర్మూర్ పట్టణంలోని మహాలక్మి కాలనీలో గల శ్రీ మహాలక్ష్మి గణేశ్ మండలి ఆధ్వర్యంలో గురువారం రాత్రి 108 రకాల నైవేద్యాలతో వినాయకుడి పూజలు నిర్వహించారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా కాలనీలోని మహిళలు 108 రకాల నైవేద్యాలను స్వామివారికి సమర్పించి ప్రత్యేకంగా అలంకరించారు. కాలనీవాసులు పెద్దఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
Similar News
News October 3, 2024
NZB: ‘ఈనెల 5లోగా DSC సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయండి’
డీఎస్సీ ద్వారా అర్హత సాధించిన అభ్యర్థులకు మెరిట్ లిస్ట్ ప్రకారం 1:3 నిష్పత్తిలో చేపడుతున్న సర్టిఫికెట్ల పరిశీలనను ఈనెల 5లోగా పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇతర జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. ఈనెల 9న హైదరాబాద్‌లో నియామక పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు.
News October 3, 2024
ఉమ్మడి జిల్లాలో దేవీ నవరాత్రుల సందడి
నేటి నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అమ్మవారి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి మందిరంలో అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. దసరా వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. ఇక్కడి అమ్మవారు భక్తుల కోరికలు నెరవేర్చే తల్లిగా విరాజిల్లుతున్నారు.
News October 3, 2024
బిక్కనూర్: భార్య పుట్టింటి నుంచి రావడం లేదని వ్యక్తి ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా బిక్కనూర్‌కి చెందిన గంధం కేశయ్య (40) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇటీవల కేశయ్య తన భార్య, కుతూరుతో గొడవపడ్డాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లి తిరిగిరాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన భార్యా కాపురానికి రాకపోవటంతో మనస్థాపం చెందిన కేశయ్య.. గురువారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రామచందర్ నాయక్ తెలిపారు.