News August 11, 2024
ఆర్మ్డ్ రిజర్వ్ విభాగాన్ని పరిశీలించిన SP

ఒంగోలులో జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కార్యాలయంలో ఆదివారం జిల్లా ఎస్పీ తనిఖీ చేసి కార్యాలయంలో వివిధ విభాగాల పనితీరు, సిబ్బంది వివరాలు పరిశీలించారు. ఈ క్రమంలో పరేడ్ గ్రౌండ్, ఏఆర్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం, ఆయుధాగారంలో ఉన్న ఆయుధ సంపత్తి, మోటర్ ట్రాన్స్పోర్ట్ విభాగం, వ్యాయామశాల, సిబ్బంది బ్యారాక్, గార్డ్ రూములు తదితర విభాగాలను పరిశీలించి, విభాగాలరికార్డుల నిర్వహణపై ఆరా తీశారు.
Similar News
News November 9, 2025
‘మీ కోసం’ రద్దు: కలెక్టర్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11న జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 10న సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ‘మీ కోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు శనివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి ఎవరూ అర్జీలు అందించేందుకు జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు.
News November 9, 2025
మత్స్యకారులకు రూ.72 లక్షలు పరిహారం: దామచర్ల సత్య

మంగళగిరిలోని మారిటైమ్ బోర్డు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి దామచర్ల సత్య హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. గత సమావేశంలో చర్చకు వచ్చిన అంశాల పురోగతిని అధికారులు వివరించారన్నారు. మొంథా సైక్లోన్ సమయంలో ఉప్పాడలో నష్టపోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు 26 బోట్లకు అందించిన రూ.72 లక్షల నష్టపరిహారానికి మారిటైం బోర్డు ఆమోదించిందన్నారు. మంత్రి జనార్దన్ రెడ్డి ఉన్నారు.
News November 9, 2025
10న ‘మీ కోసం’ రద్దు: ఎస్పీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11న జిల్లాకు రానున్నారు. ఈక్రమంలో ఈనెల 10న జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించనున్న ‘మీ కోసం’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు శనివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి ఎవరూ ‘మీ కోసం’ కార్యక్రమానికి రావద్దని సూచించారు.


