News August 16, 2024
ఆర్యవైశ్యులకు అన్ని రకాల సహకరిస్తా: ఎంపీ రఘునందన్

ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆర్యవైశ్యులందరికి తనవంతు సహకారం ఎప్పుడు ఉంటుందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం రాత్రి సిద్దిపేటలోని ఆర్యవైశ్య భవనం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్యవైశ్యులు రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ కాల్వ సుజాత, బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
Similar News
News December 1, 2025
MDK: అభ్యర్థులకు కొత్త బ్యాంక్ ఖాతా తప్పనిసరి: కలెక్టర్

స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంక్ ఖాతా తెరవాలని, అన్ని లావాదేవీలు ఆ ఖాతా ద్వారా జరగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, నామినేషన్ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలని, పాత కుల సర్టిఫికెట్ కూడా చెల్లుబాటు అవుతుందని అన్నారు. సమస్యల కోసం హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
News December 1, 2025
MDK: 15 హామీలతో అభ్యర్థి బాండ్ పేపర్

హవేలి ఘనపూర్ మండలం రాజుపేట్ తండా నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మౌనిక 15 హామీలతో బాండ్ రాసిచ్చి ప్రచారం చేస్తున్నారు. 6 నెలలలోపు కొత్త ట్రాలీ కొని చెత్తసేకరణ, వృద్దులకు ఇంటివద్దకే పింఛన్ పంపిణీ, రోజు మంచినీటి సరఫరా, కొత్తగా మహిళా సంఘాలు ఏర్పాటు చేసి రూ.లక్ష లోన్ మంజూరు,
గిరిజనుల తీజ్ పండుగకు ఏడాదికి రూ.20 వేలు, ముదిరాజ్ బోనాలకు రూ.8 వేలు ఇలా హామీలను బాండ్‌పై రాసి ప్రచారం చేస్తున్నారు.
News December 1, 2025
మెదక్: శిక్షణలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్

మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ప్రశాంత్ శిక్షణలో ప్రతిభ చూపడంతో ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ అభినందించారు. మొయినాబాద్ ఐఐటీఏ శిక్షణకు వివిధ జిల్లా నుంచి 51 మంది హాజరయ్యారు. జిల్లాకు చెందిన ప్రదీప్, ప్రశాంత్, రాకేష్ హాజరయ్యారు. ఫైరింగ్, పీపీటీ విభాగాల శిక్షణలో ప్రశాంత్ ఉత్తమ ప్రతిభ చూపి మెడల్ పొందాడు. ప్రశాంత్‌ను ఎస్పీ అభినందించారు.


