News September 15, 2024
ఆర్సీపురం: గుండెపోటుతో యువకుడు మృతి

గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన రామచంద్రపురంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సిర్గాపూర్ మండలం సుర్త్యా నాయక్ తాండకు చెందిన జైపాల్ (28) కుటుంబ సభ్యులతో ఆర్సీపురంలో ఉంటున్నారు. అయితే స్థానిక వినాయక మండపంలో శనివారం రాత్రి డాన్స్ చేసి నీరసించిపోయి. ఇంటికి వచ్చి నిద్రించాడు. ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
Similar News
News November 19, 2025
మెదక్: బ్యాట్ పట్టిన ఎంపీ రఘునందన్ రావు

ఎంపీ రఘునందన్ రావు క్రికెట్ బ్యాట్ పట్టారు. మెదక్లో క్రీడాకారులతో సరదాగా కొద్దిసేపు క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మెదక్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి 17 సంవత్సరాలలోపు బాలుర క్రికెట్ పోటీలు ఘనంగా నిర్వహించారు.
ముగింపు కార్యక్రమంలో ఎంపీ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.
News November 19, 2025
మెదక్: క్రీడా ఉత్సవాల ముగింపులో పాల్గోన్న ఎంపీ

జిల్లా కేంద్రంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అండర్-17విభాగంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గోని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం గెలుపొందిన ఇరు జట్లకు బహుమతులు అందజేశారు. MP మాట్లాడుతూ.. క్రికెటర్ తిలక్ వర్మను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు.