News October 11, 2024

ఆలపాటిని అఖండ మెజార్టీతో గెలిపించాలి: లావు, ప్రత్తిపాటి

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. గురువారం చిలకలూరిపేటలోని టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. 120 రోజుల్లోనే దేశంలో ఎక్కడా జరగని విధంగా పనులు చేశామని యువతకు చెప్పిమరీ ఓట్లు అడగాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పట్టభద్రులంతా ఓటు నమోదయ్యేలా చూడాలన్నారు.

Similar News

News September 15, 2025

సమయపాలన, క్రమశిక్షణ పాటించాలి: ఎస్పీ వకుల్

image

పోలీస్ సిబ్బందిలో క్రమశిక్షణ, సమయపాలన, జవాబుదారీతనం పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో రోల్ కాల్ నిర్వహించాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. సోమవారం ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి పోలీస్ సిబ్బంది చక్కని యూనిఫామ్ ధరించి, సమయపాలన పాటించాలని, ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఎస్పీ సూచించారు.

News September 15, 2025

పులిపాటి వెంకటేశ్వర్లు మన తెనాలి వారే

image

తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు పులిపాటి వెంకటేశ్వర్లు గుంటూరు జిల్లా తెనాలిలో 1890 సెప్టెంబర్ 15న జన్మించారు. పద్య నాటకం పట్ల అభిమానం ఏర్పరుచుకున్న పులిపాటి తెనాలి రామ విలాస సభలో సభ్యుడిగా చేరారు. నాటకాలలో అర్జునుడు, నక్షత్రకుడు, భవానీ శంకరుడు, సుబుద్ధి, తదితర పాత్రలను పోషించడమే కాక,1932లో సినిమా రంగంలో ప్రవేశించి చింతామణి, హరిశ్చంద్ర తదితర 12 సినిమాల్లో నటించారు.

News September 15, 2025

తొలి తెలుగు కథానాయకుడు, తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన నటుడు

image

తెలుగు సినిమా కథానాయకుడు, సుప్రసిద్ధ రంగస్థల నటుడు వల్లూరి వెంకట సుబ్బారావు గుంటూరు జిల్లా మునిపల్లె గ్రామంలో జన్మించడం వలన మునిపల్లె సుబ్బయ్య గుర్తింపు పొందారు. ఈయన వెంకటగిరి రాజా వారిచే “నటశేఖర” బిరుదు పొందారు. సెప్టెంబర్ 15 1931లో తొలి టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద”లో హిరణ్యకశపునిగా నటించి చరిత్ర సృష్టించారు. ఈయన తొలి తెలుగు కథానాయకుడే కాక, తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసి చరిత్రలో నిలిచిపోయారు.