News February 3, 2025
ఆలపాటిని ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం: గొట్టిపాటి

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్‌ని ఎమ్మెల్సీగా గెలిపించుకుందామని జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం పేర్కొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ గెలుపునకు అందరూ కృషి చేయాలన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు, శాసనసభ్యులు పాల్గొన్నారు.
Similar News
News November 25, 2025
వరంగల్: అన్ని పార్టీల చూపు మల్లమ్మ వైపే..?

WGL(D) సంగెం(M) ఆశాలపల్లిలో ఎస్సీ జనాభా లేకపోయినా 2011 లెక్కల్లో పొరపాటుతో సర్పంచ్ స్థానం SC మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలో ఒక్క SCగా 60ఏళ్ల కొంగర మల్లమ్మ ఉండటంతో ఆమెకే జాక్‌పాట్. మొత్తం 1,647 ఓట్లున్న ఈ గ్రామంలో ఇప్పుడు మల్లమ్మ ప్రజెంట్ ఫేవరెట్‌గా మారింది. ఇప్పటికే కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు కూడా ఆమెను సంప్రదిస్తున్నాయట. ప్రేమవివాహం చేసుకున్న BC-SC దంపతులపైనా పార్టీల దృష్టి పడినట్లు సమాచారం.
News November 25, 2025
అక్కడ ఆయన.. ఇక్కడ ఈయనపై విచారణ..!

తిరుమల వివాదాల్లో ఇద్దరు రాజకీయ నాయకులను ప్రత్యేక దర్యాప్తు బృందాలు విచారించాయి. కల్తీ నెయ్యి కేసులో HYDలో వైవీ సుబ్బారెడ్డిని సీబీఐ సిట్, పరకామణీ కేసులో తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డిని సీఐడీ విచారించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఎన్నడు లేనివిధంగా టీటీడీలో చోటుచేసుకున్న వివాదాలు.. మాజీ ఛైర్మన్ల విచారణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News November 25, 2025
ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే ఐబొమ్మ రవి దొరికాడు: పోలీసులు

TG: ఐబొమ్మ రవికి కష్టపడి జాబ్ చేయాలన్న ఆలోచన లేదని సైబర్ క్రైమ్ అడిషనల్ CP శ్రీనివాస్ వెల్లడించారు. ‘టెక్నాలజీ తెలుసు. ఈజీ మనీ కోసం సినిమాలను పైరసీ చేశాడు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే రవి దొరికాడు. అతడి భార్య మాకు సమాచారం ఇచ్చిందనేది అవాస్తవం. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసి రూ.20 కోట్ల వరకు సంపాదించాడు. మూవీరూల్జ్, తమిళ్ఎంవీ లాంటి పలు పైరసీ సైట్ల నిర్వాహకులను పట్టుకుంటాం’ అని స్పష్టం చేశారు.


