News March 4, 2025
ఆలపాటి రాజా తండ్రి నేపథ్యం ఇదే

ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ స్థాపకులు ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితులు. ఆయన తండ్రి శివరామకృష్ణ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయనకు ఎన్టీఆర్ అంటే ఇష్టంతో పార్టీ కోసం తన సొంత ఇంటిని, ఆయన పింఛన్లు కూడా పార్టీకి విరాళంగా ఇచ్చారని చెబుతారు. ఆయన కూడా తన తండ్రి బాటలో నడిచి టీడీపీలో అనేక హోదాలలో పనిచేశారు. ఆయన రాజకీయాలకు ముందు హైదరాబాదులో ఎన్టీఆర్, టీడీపీ కేసులన్నీ వాదించే టీంలో లాయర్గా పనిచేశారు.
Similar News
News October 18, 2025
గుంటూరు: సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

దీపావళి పండుగ సందర్భంగా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం లేదని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శనివారం తెలిపారు. దీపావళి సందర్భంగా సెలవు దినం కావడంతో పీజీఆర్ఎస్ జరగదని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వ్యయ ప్రయాసలతో కలెక్టరేట్కు రావద్దని కలెక్టర్ సూచించారు.
News October 18, 2025
తెలుగులో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడితడు

రావూరి భరద్వాజ (జులై 5, 1927- అక్టోబరు 18, 2013) గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడు. తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా ఆయన పేరుతెచ్చుకున్నారు. ఆయన 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించారు.
#నేడు ఆయన వర్ధంతి
News October 18, 2025
GNT: ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి..!

గుంటూరు జిల్లాలోని పలు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ఫీజుల కోసం తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పడడంతో, ఆ మొత్తాన్ని చెల్లిస్తేనే సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తామని యాజమాన్యాలు మెలిక పెట్టాయి. బీటెక్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పాత ఫీజుల పేరుతో పరీక్ష ఫీజులు కూడా కట్టించుకోకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు.