News April 16, 2025
ఆలమూరు: నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిలింగ్.. నిందితుడి అరెస్టు

ఆలమూరు మండలం చెముడులంక యువతిని నగ్న చిత్రాలతో డబ్బు కోసం బెదిరిస్తున్న కర్నూలు(D) కల్లూరు(M) తటకనాపల్లికి చెందిన హరీశ్ను అరెస్టు చేశామని SI అశోక్ తెలిపారు. అతడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారన్నారు. మూడేళ్ల క్రితం స్నాప్ యాప్ ద్వారా యువతి పరిచయమైంది. దీంతో ఆమె నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతుండగా స్క్రీన్ షాట్స్ తీసి 3ఇన్స్టా ఖాతాల్లో పోస్ట్ చేసి వేధించాడని వెల్లడించారు.
Similar News
News October 27, 2025
మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు

మొంథా తుఫాన్ ప్రభావంతో పలు రైళ్లను రద్దు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. బొబ్బిలి రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు చెసే విశాఖ – కోరాపుట్ – విశాఖ పాసింజర్&ఎక్సప్రెస్, గుంటూరు – రాయగడ – గుంటూరు ఎక్సప్రెస్ను రైల్వే అధికారులు రద్దు చేశారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవనుండటంతో రైళ్లను రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్శియల్ మేనేజర్ చెప్పారు.
News October 27, 2025
ఎన్టీఆర్ జిల్లాలో 189 పునరావాస కేంద్రాలు

మొంథా తుపాను నేపథ్యంలో ప్రజల భద్రతకు జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. 189 పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని, అత్యవసర సహాయానికి 24×7 కంట్రోల్ రూమ్ (91549 70454) అందుబాటులో ఉందని కలెక్టర్ వెల్లడించారు.
News October 27, 2025
సిరిసిల్ల: జిల్లాలోని 48 దుకాణాలకు లక్కీ డ్రా

జిల్లాలోని మొత్తం 48 మద్యం దుకాణాలకు లక్కీడ్రా తీసి వారి నంబర్ వచ్చిన వారికి కేటాయించినట్లు సిరిసిల్ల ఇన్చార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో మద్యం దుకాణాల లక్కీడ్రాను సోమవారం నిర్వహించామన్నారు. జిల్లాలోని మొత్తం 48 మద్యం దుకాణాలకు, గౌడ్లకు 4, SCలకు 5 కేటాయించమన్నారు. మొత్తం 48 దుకాణాలకు 1381 దరఖాస్తులు వచ్చాయన్నారు. డిసెంబర్ 1 నుంచి నూతన దుకాణాలు ప్రారంభమవుతాయన్నారు.


