News March 29, 2025
ఆలమూరు: నూకాంబికమ్మను దర్శించిన ప్రముఖ హాస్య నటుడు

ఆలమూరు మండలం చింతలూరు నూకాంబికా అమ్మవారిని ప్రముఖ సినీ నటుడు, రచయిత, కళాకారుడు పోలాప్రగడ జనార్ధన్ రావు (జెన్నీ) శనివారం దర్శించుకున్నారు. అమలాపురంలో జరుగుతున్న ఒక సినిమా షూటింగ్కు వచ్చిన ఆయన తన అమ్మమ్మ ఊరు అయిన చింతలూరు వచ్చి ఉత్తర ముఖ వేంకటేశ్వరస్వామివారిని, నూకాలమ్మ అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారు. భక్తుల సహకారంతో అమ్మవారి ఆలయం దినదినాభివృద్ధి చెందడం శుభపరిణామం అని అన్నారు.
Similar News
News November 7, 2025
రేపు ప్రకాశం జిల్లాలో పాఠశాలలకు సెలవు రద్దు

మొంథా తుఫాను కారణంగా జిల్లాలో గత నెలలో ఐదు రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఇచ్చిన కారణంగా ఈనెల 8న రెండో శనివారం అన్ని యాజమాన్య పాఠశాలలు యథావిధిగా నిర్వహించాలని DEO కిరణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. 2026 మార్చి వరకు ప్రతి రెండో శనివారం పాఠశాలలను నిర్వహించాలన్నారు. పాఠశాలల సిబ్బంది నియమాలు పాటించాలన్నారు.
News November 7, 2025
సూర్యాపేట: భార్యను చంపిన భర్త

సూర్యాపేట జిల్లా మోతె మండలం విభాళాపురంలో దారుణం జరిగింది. భర్త మద్యం మత్తులో భార్యను కర్రతో కొట్టి చంపాడు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News November 7, 2025
కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్: CM రేవంత్

TG: గతంలో అభివృద్ధి చేసిన PJR, మర్రి శశిధర్ రెడ్డి HYD బ్రదర్స్ అయితే, ఇప్పుడు డెవలప్మెంట్ను అడ్డుకుంటున్న KTR, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అని CM రేవంత్ విమర్శించారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, RRRను అడ్డుకుంటోంది వీరేనని మండిపడ్డారు. BRS హయాంలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదన్నారు. KCR, KTR, హరీశ్ రావు వందల ఎకరాల్లో ఫామ్హౌస్లు నిర్మించుకున్నారని CM దుయ్యబట్టారు.


