News March 29, 2025

ఆలమూరు: నూకాంబికమ్మను దర్శించిన ప్రముఖ హాస్య నటుడు

image

ఆలమూరు మండలం చింతలూరు నూకాంబికా అమ్మవారిని ప్రముఖ సినీ నటుడు, రచయిత, కళాకారుడు పోలాప్రగడ జనార్ధన్ రావు (జెన్నీ) శనివారం దర్శించుకున్నారు. అమలాపురంలో జరుగుతున్న ఒక సినిమా షూటింగ్‌కు వచ్చిన ఆయన తన అమ్మమ్మ ఊరు అయిన చింతలూరు వచ్చి ఉత్తర ముఖ వేంకటేశ్వరస్వామివారిని, నూకాలమ్మ అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారు. భక్తుల సహకారంతో అమ్మవారి ఆలయం దినదినాభివృద్ధి చెందడం శుభపరిణామం అని అన్నారు.

Similar News

News July 11, 2025

NZB: కూలీల కొరత.. పొరుగు రాష్ట్రాల నుంచి బారులు

image

నిజామాబాద్ జిల్లాలో కూలీల కొరత వేధిస్తోంది. ఇక్కడి వారు ఉపాధి కొసం మలేషియా, కెనడాతో పాటు పలు దేశాలకు వలస వెళ్తున్నారు. దీంతో జిల్లాలో కూలీల కొరత ఏర్పడుతుంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులకు జిల్లా రైతులు ఆహ్వానం పలుకుతున్నారు. వరినాట్లు, హమాలీ పనులకు బిహార్, బెంగాల్, మహరాష్ట్ర నుంచి కూలీలు వస్తున్నారు. ఒక ఎకరం వరినాట్లు వేస్తే రూ. 4000 నుంచి రూ. 5000 వరకు కూలీ చెల్లిస్తున్నారు.

News July 11, 2025

నిజామాబాద్: వామ్మో.. డెంగ్యూ

image

నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ కేసులు బెంబెలెత్తిస్తున్నాయి. గత నెలలో 25 కేసులు నమోదవ్వగా ఈనెలలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు డెంగీ, సీజనల్ వ్యాధులు, విష జ్వరాలపై వైద్యాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కేసులు నమోదవుతున్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు కాచిచల్లార్చిన నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

News July 11, 2025

BHPL: రైతులందరూ ఫార్మర్ ఐడీని నమోదు చేసుకోవాలి

image

భూపాలపల్లి జిల్లాలోని రైతులందరూ ఫార్మర్ ఐడీని నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు కోరుతున్నారు. ఫార్మర్ ఐడీ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెడుతున్న పథకాలకు అర్హులవుతారని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, రైతులు సంబంధిత ఏఈవోలను సంప్రదించి ఫార్మర్ ఐడీని నమోదు చేసుకోవాలని కోరారు.