News February 13, 2025
ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించండి: డీకే అరుణ

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను ఎంపీ డీకే అరుణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్లోని ఐదవ శక్తి పీఠం జోగులాంబ ఆలయంతో పాటు కురుమూర్తి, మన్నెంకొండ, మల్దకల్ తిమ్మప్ప దేవాలయాల అభివృద్ధికి “ప్రసాద్ పథకం” కింద నిధులు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ ప్రతిపాదనలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు.
Similar News
News December 2, 2025
VKB: పంచాయతీ బరిలో నిలిచేదెవరో.. తప్పుకునేదెవరో..?

వికారాబాద్ జిల్లాలో ఎన్నికల ‘పంచాయతీ’ వేడెక్కింది. దాదాపు 2ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బరిలో నిలిచేందుకు ఆశావహులు భారీగా పోటీ పడుతున్నారు. కొన్నిచోట్ల ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేయడం నేతలకు తలనొప్పిగా మారింది. ఓట్లు చీలకుండా ఒక్కరినే బరిలో దించేందుకు, నామినేషన్ల ఉపసంహరణకు నాయకులు బుజ్జగిస్తున్నారు. రేపటితో తొలివిడత బరిలో నిలిచేదెవరో.. తప్పుకునేదెవరో తేలనుంది.
News December 2, 2025
WGL: రెండో విడతకు నేడు చివరి రోజు

ఉమ్మడి జిల్లాలో రెండో దశ నామినేషన్ల స్వీకరణ నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రెండో విడతలో 564 జీపీలు, 4928 వార్డులకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నెల 2 వరకు నామినేషన్ల స్వీకరణ అనంతరం, 3న పోటీలో ఉన్న వారి జాబితాను సాయంత్రం 5 గంటలకు ప్రదర్శించనున్నారు. 6న నామినేషన్ల ఉపసంహరణ, 14న పోలింగ్ ఉండనుంది. ఇప్పటి వరకు సర్పంచ్ స్థానాలకు 1,365 నామినేషన్లు, వార్డు స్థానాలకు 3037 నామినేషన్లు దాఖలయ్యాయి.
News December 2, 2025
మదనపల్లె జిల్లా ప్రకటించినా..!

మదనపల్లె జిల్లాపై ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేశ్ హామీ ఇచ్చారు. తాజాగా జిల్లాను ప్రకటిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కూటమి ప్రభుత్వంతోనే జిల్లా సాధ్యమైందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పోస్టర్లు పంచాలని హైకమాండ్ ఆదేశించింది. ఇక్కడ గ్రూపులు, ఖర్చు ఎందుకులే అని నాయకులు ప్రచారం చేయకుండా సైలెంట్ అయ్యారట. నా వల్లే వచ్చిందని MLA, నావల్లే వచ్చిందని మరికొందరు వేర్వేరుగా చెప్పుకోవడం కొసమెరుపు.


