News February 13, 2025
ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించండి: డీకే అరుణ

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను ఎంపీ డీకే అరుణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్‌లోని ఐదవ శక్తి పీఠం జోగులాంబ ఆలయంతో పాటు కురుమూర్తి, మన్నెంకొండ, మల్దకల్ తిమ్మప్ప దేవాలయాల అభివృద్ధికి “ప్రసాద్ పథకం” కింద నిధులు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ ప్రతిపాదనలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు.
Similar News
News March 15, 2025
రాజమండ్రి: 23 నుంచి సీపీఐ రాజకీయ ప్రచార జాత

రాజ్యాంగ పరిరక్షణ, సోషలిజం, సెక్యులరిజం, సామాజిక న్యాయమే లక్ష్యంగా మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు సీపీఐ రాజకీయ ప్రచార జాత నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. రాజమండ్రిలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ వందేళ్ల చరిత్రను నాటకాల ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈ క్రమంలో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
News March 15, 2025
ప్రకాశం: ఈనెల 19న మెగా జాబ్ మేళా

ఈనెల 19న ఒంగోలులోని శ్రీహర్షిని డిగ్రీ కళాశాలలో సంకల్ప్ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ అన్సారియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్‌లో శనివారం జాబ్ మేళా ప్రచార గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 10 నుంచి పీజీ వరకు చదివిన యువత జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు.
News March 15, 2025
మెదక్: ఒక్కరోజు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 22న వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో హెర్బేరియం తయారీ, నిలువ చేయు విధానం అనే అంశంపై ఒక్కరోజు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. హుస్సేన్ తెలిపారు. రాష్ట్రీయ ఉచిత ఉచితార్ శిక్షాభియన్ వారి ఆర్థిక సహకారంతో ఈ కార్యశాలకు సంబంధించిన ప్రచార పత్రాన్ని కళాశాలలో ఆవిష్కరణ చేశారు.