News June 22, 2024
ఆలయ అభివృద్ధికి కృషి: ఆలయ ఈవో
ఆలయ అభివృద్ధికి సాధ్యమైనంత కృషి చేస్తానని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఈవో భాస్కరరావు అన్నారు. ఆయన బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడారు. దాతల సహకారం, ఆలయ నిధులతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 9, 2024
NLG: నేటి నుంచి సమగ్ర సర్వే షురూ
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి శుక్రవారం వరకు గృహాలకు స్టిక్కర్లు అంటించే ప్రక్రియను ఎన్యుమరేటర్లు పూర్తి చేశారు. ఇళ్ల లెక్క ప్రకారం ఒక్కో ఎన్యుమరేటర్‌కు 70 నుంచి 200 గృహాలను కేటాయించిన విషయం తెలిసిందే. నేటి నుంచి 75 ప్రశ్నలతో కూడిన సమగ్ర సర్వే చేపట్టనున్నారు.
News November 9, 2024
తగ్గుముఖం పడుతున్న సాగర్ రిజర్వాయర్ నీటిమట్టం
నాగార్జునసాగర్ రిజర్వాయర్లో నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఎగువ నుంచి రిజర్వాయర్‌కు ఇన్ ఫ్లో తగ్గిపోవడంతో రిజర్వాయర్ లో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. 590 అడుగులుగా ఉండాల్సిన ప్రాజెక్ట్ గరిష్ట నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 586.80 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకు 304.4680టీఎంసీలుగా ఉంది.
News November 9, 2024
వినూత్న ఆలోచనలకు ప్రోత్సాహకం : అల్తాఫ్ హుస్సేన్
విశ్వవిద్యాలయంలోని సదుపాయాలను సద్వినియోగపరచుకొని వినూత్న ఆలోచనలతో వచ్చే ప్రతి విద్యార్థిని తప్పక ప్రోత్సహిస్తామని ఎంజీ యూనివర్శిటీ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంఎస్ఎన్ బిజినెస్ చైర్ బాధ్యులు ఆచార్య వసంత అధ్యక్షతన ఎంజీ యూనివర్శిటీలో ఉల్లి సాగులో బయో ఉత్పత్తులు అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.