News December 12, 2024

ఆలయ హుండీ అపహరణకు విఫలయత్నం

image

లింగాల మండలం వెలిగండ్ల గ్రామ సమీపంలో ఉన్న దేవరకోన వరదరాజుల స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దుండగులు ఆలయ హుండీ అపహరణకు విఫలయత్నం చేశారు. ఆలయంలో హుండీని కాంక్రీటుతో పూడ్చి ఉండగా, కాంక్రీటును తొలగించి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అయితే హుండీని బలమైన ఇనుపతో తయారు చేయడంతో అది పగలకపోవడంతో పారిపోయారు. గతంలో కూడా హుండీని ఎత్తుకెళ్లి పగలగొట్టే ప్రయత్నం చేశారని ఆలయ అర్చకులు తెలిపారు.

Similar News

News November 9, 2025

కడప: వివాదంగా మారిన టీచర్లు టూర్

image

మైదుకూరు మండలం నంద్యాలం పేట కాంప్లెక్స్ పరిధిలోని 20మంది టీచర్లు ఒకేసారి సెలవు పెట్టి టూర్‌కు వెళ్లారు. ఒకే టీచర్ ఉన్న స్కూళ్ల నుంచి సైతం సెలవు పెట్టడం వివాదాస్పదమైంది. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రెండో శనివారం లీవ్ ఉంటుందని టీచర్లు ముందుగానే టూర్ ప్లాన్ చేసుకున్నారు. చివరి నిమిషంలో ఆ లీవ్ రద్దు చేశారు. టూర్ క్యాన్సిల్ చేసుకోలేక అందరూ వెళ్లారు.

News November 9, 2025

విజయవంతమైన జిల్లాస్థాయి విద్యార్థుల మాక్ అసెంబ్లీ

image

ప్రొద్దుటూరులోని జార్జ్ కోరోనేషన్ క్లబ్‌ వద్ద జిల్లాస్థాయి విద్యార్థుల మాక్ అసెంబ్లీని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ ప్రారంభించారు. 36 మండలాల నుంచి 108 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 7 నియోజకవర్గాల నుంచి ఏడుగురు విద్యార్థులను ఎన్నికచేసినట్లు వివరించారు. వీరు ఈనెల 26న అమరావతిలో నిర్వహించనున్న విద్యార్థుల మాక్ అసెంబ్లీలో పాల్గొటారన్నారు.

News November 8, 2025

ప్రొద్దుటూరు: అధికార పార్టీనే వీరి అడ్డా..!

image

ప్రొద్దుటూరు క్రికెట్ బుకీల గురించి వైసీపీ, టీడీపీ మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇక్కడి పేరుమోసిన క్రికెట్ బుకీలంతా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోనే ఉంటున్నారు. అధికార పార్టీ నుంచి కౌన్సిలర్లుగా, సర్పంచులుగా పోటీ చేస్తున్నారు. 2014-19లో టీడీపీలో ఉన్న క్రికెట్ బుకీలు, 2019లో వైసీపీలోకి జంప్ అయ్యారు. 2024లో వైసీపీ ఓడిపోగానే మళ్లీ టీడీపీలోకి వచ్చారు. క్రికెట్ బుకీలు అధికారం అండలోనే ఉంటున్నారు.