News December 12, 2024

ఆలయ హుండీ అపహరణకు విఫలయత్నం

image

లింగాల మండలం వెలిగండ్ల గ్రామ సమీపంలో ఉన్న దేవరకోన వరదరాజుల స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దుండగులు ఆలయ హుండీ అపహరణకు విఫలయత్నం చేశారు. ఆలయంలో హుండీని కాంక్రీటుతో పూడ్చి ఉండగా, కాంక్రీటును తొలగించి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అయితే హుండీని బలమైన ఇనుపతో తయారు చేయడంతో అది పగలకపోవడంతో పారిపోయారు. గతంలో కూడా హుండీని ఎత్తుకెళ్లి పగలగొట్టే ప్రయత్నం చేశారని ఆలయ అర్చకులు తెలిపారు.

Similar News

News January 14, 2025

నలుగురికి పునర్జన్మనిచ్చిన ప్రొద్దుటూరు వాసి

image

ప్రొద్దుటూరు మండలం గోపవరానికి చెందిన గోపిరెడ్డి రాజశేఖర్‌‌రెడ్డి(53) బ్రెయిన్ డెడ్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. రాజశేఖర్‌‌ ఈనెల 1న బైక్ పైనుంచి పడి అపస్మారక స్థితికి వెళ్లారు. 11 రోజుల చికిత్స అనంతరం వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. దీంతో అతని భార్య శ్రీదేవి అవయవదానానికి సహకరించారు. దీంతో అతని అవయవాలతో నలుగురికి పునర్జన్మను కల్పించారు.

News January 14, 2025

పులివెందులలో జోరుగా కోళ్ల పందేలు

image

సంక్రాంతి పండగను పురస్కరించుకుని పులివెందులలో తొలిసారి జోరుగా కోళ్ల పందేలు సాగుతున్నాయి. పులివెందుల మున్సిపాలిటీలోని ఉలిమెల్ల, మండలంలోని ఈ.కొత్తపల్లి, ఎర్రిపల్లె తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. ఈ పందేల్లో తొలిరోజే రూ.2 కోట్లకు పందేలు జరిగినట్లు తెలుస్తోంది. పులివెందులలో 8 చోట్ల బరులు ఏర్పాటు చేయగా.. లింగాల మండలంలోనే దాదాపు రూ. 50 లక్షలకు పందేలు జరిగినట్లు సమాచారం.

News January 14, 2025

కడప: గాలిపటం ఎగరేస్తుండగా విద్యుత్ షాక్

image

సంక్రాంతితో కడప జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. పెద్దలు పిండివంటల తయారీలో బిజీగా ఉంటే, పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కడపలోని శాంతి నగర్‌కు చెందిన ఓ బాలుడు సోమవారం గాలిపటం ఎగురేశాడు. విద్యుత్ వైర్లకు తగలడంతో తప్పించేందుకు గట్టిగా లాగగా విద్యుత్ వైరు బాలుడిపై పడి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. చికిత్స నిమిత్తం రిమ్స్‌కు అక్కడినుంచి మరో ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.