News December 11, 2024
ఆలుబాక శివారులో పెద్దపులి సంచారం..!

వెంకటాపురం మండలం ఆలుబాక శివారులో పెద్దపులి సంచరిస్తోందని రైతులు చెబుతున్నారు. ఆలుబాక- బోధాపురం మిర్చి తోటకు వెళ్ళే గోదావరి పాయలో పులి అడుగుజాడలు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో పుచ్చపంట దగ్గర పడుకున్న రైతులకు పులి అరుపులు వినిపించినట్లు చెబుతున్నారు. మంగళవారం స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పులి అడుగులను గుర్తించారు.
Similar News
News February 28, 2026
ఖమ్మం: అదనపు కలెక్టర్‌కు తీన్మార్ మల్లన్న వినతి

భూదాన్ భూముల బాధిత కుటుంబాలకు అదే భూమిలో పునరావాసం కల్పించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని కోరారు. శనివారం తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్‌ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. తక్షణ సహాయం కింద ప్రతి బాధిత కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించాలని కోరారు. భూదాన్ భూముల విషయంలో పేదలపై మాత్రమే చర్యలు తీసుకోవడం అన్యాయమని లేఖలో ప్రస్తావించారు.
News February 28, 2026
ఖమ్మం: పేరుకు మాత్రమే పేదల పార్టీ: ఈటల

కనికరం లేకుండా పేదల ఆవాసాలను కూల్చివేసి తప్పు జరిగినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా బాధితులకు క్షమాపణ చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పేదలు ఓట్లు వేస్తే గద్దెనెక్కిన ఈ పార్టీ పేరుకు మాత్రమే పేదల పార్టీ అని చేతల్లో మాత్రం రాక్షస పార్టీ అని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని, కూల్చిన చోటే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. లేకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు.
News February 28, 2026
రేపు ఖమ్మంకు నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడి రాక

నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆదివారం ఖమ్మంలో పర్యటించనున్నట్లు జిల్లా బీజేపీ నాయకుడు జాటోత్ మధునాయక్ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సా.3 గంటలకు ఎస్టీ కమిషన్ సభ్యుడు వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులను పరామర్శిస్తారని చెప్పారు. అనంతరం భూదాన్ భూముల్లో కూల్చివేసిన ఇళ్లను పరిశీలిస్తారని అన్నారు. ఈ విషయాన్ని అధికారులు, ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.


