News July 14, 2024

‘ఆలూరులో టీడీపీని బతికించండి’

image

ఆలూరు నియోజకవర్గంలో చతికిలపడ్డ టీడీపీని బతికించాలని శనివారం నియోజకవర్గానికి చెందిన నేతలు అధిష్ఠానానికి విన్నవించారు. అధినేత చంద్రబాబు, లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసును కలిసి పలు విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. వీరభద్ర గౌడ్ స్థానిక నాయకులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లకపోవడం వల్లే 2024 ఎన్నికల్లో ఓటమి చెందారని, ఈయన స్థానంలో కొత్త ఇన్‌ఛార్జిని నియమించాలని కోరినట్లు వారు తెలిపారు.

Similar News

News November 23, 2025

అదే మా లక్ష్యం: కర్నూలు ఎస్పీ

image

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రతి శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. హెల్మెట్ తప్పనిసరి, ఓవర్‌స్పీడ్–ఓవర్‌లోడ్‌ నిషేధం, డ్రంక్ అండ్ డ్రైవ్‌ చేయరాదని ప్రజలకు సూచించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.

News November 23, 2025

నిబద్ధత, సేవ భావంతో సేవలు అందించాలి: కలెక్టర్

image

ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వచ్చే విధంగా నిబద్ధతతో సేవాభావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థల శిక్షణ పొందుతున్న 16 మంది యువ ఐపీఎస్, యువ ఐఏఎస్‌లతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ.. పరిపాలనలో మానవీయ కోణంలో ప్రజలకు సేవలు అందించాలన్నారు.