News June 4, 2024
ఆలూరులో సీటు వైసీపీ ఖాతాలోకి..!

ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి బీ.విరుపాక్షి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్‌పై 2,831 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2వ రౌండ్, 9, 13, 14, 18, 19, 20, 21, 22 రౌండ్లు మినహా మిగిలిన రౌండ్లలో విరుపాక్షి ఆధిక్యం కనబర్చారు. విరుపాక్షికి మొత్తం 1,00,264 ఓట్లు పోలవ్వగా.. వీరభద్ర గౌడ్‌కు 97,433 ఓట్లు పడ్డాయి. ఈ విజయంతో ఆలూరు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
Similar News
News December 4, 2025
సూర్య ఘర్‌పై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయండి: కలెక్టర్

పీఎం సూర్య ఘర్ పథకం ప్రయోజనాలు ప్రతీ ఇంటికి చేరేలా విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. 2026-27 నాటికి దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం లక్ష్యమన్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో లక్ష గృహాలకు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News December 4, 2025
మెగా పేరెంట్స్ మీటింగ్ విజయవంతం చేయాలి: కలెక్టర్

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు చురుకైన పాత్ర వహించాలని, మెగా పేరెంట్స్ మీటింగ్‌ను ప్రతీ పాఠశాలలో విజయవంతం చేయాలని కలెక్టర్ డా. ఏ.సిరి ఆదేశించారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడానికి ఈ సమావేశం కీలకమని ఆమె తెలిపారు. మీటింగ్‌లో చర్చించాల్సిన ప్రధాన అంశాలు ప్రతీ విద్యార్థి విద్యా ప్రగతి, పదో తరగతి 100 రోజుల ప్రణాళిక అమలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ ఉంటుందన్నారు.
News December 4, 2025
రోడ్డు భద్రతపై కర్నూలు పోలీసుల కఠిన నిఘా

రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాత్రి తిరిగే బస్సుల్లో పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైవేలు 40, 44 సహా ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్ పరిధుల్లో భారీ వాహనాలను ఆపి చెక్ చేస్తున్నారు.


