News June 4, 2024

ఆలూరులో సీటు వైసీపీ ఖాతాలోకి..!

image

ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి బీ.విరుపాక్షి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్‌పై 2,831 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2వ రౌండ్, 9, 13, 14, 18, 19, 20, 21, 22 రౌండ్లు మినహా మిగిలిన రౌండ్లలో విరుపాక్షి ఆధిక్యం కనబర్చారు. విరుపాక్షికి మొత్తం 1,00,264 ఓట్లు పోలవ్వగా.. వీరభద్ర గౌడ్‌కు 97,433 ఓట్లు పడ్డాయి. ఈ విజయంతో ఆలూరు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

Similar News

News November 6, 2024

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక నిర్ణయం

image

రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. R&B కాంట్రాక్ట్ బిడ్‌లకు అర్హత కాల పరిమితిని 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచారు. ఈ నిర్ణయంతో చిన్న, మధ్య తరగతి R&B కాంట్రాక్టర్లకు భారీ ఊరట లభించనుంది.

News November 6, 2024

ఆంగ్లో ఇండియన్స్ సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఫరూక్

image

రాష్ట్రంలో ఉన్న ఇండియన్స్ కుటుంబాల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ఆంగ్లో ఇండియన్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందం మంత్రిని కలిసింది. గత ప్రభుత్వం ఆంగ్లో ఇండియన్స్ సమస్యలను విస్మరించిందని మంత్రి ఫరూక్ అన్నారు.

News November 6, 2024

కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలు లేవు: ఎస్పీ

image

దేవనకొండ మండలం, కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుపక్క గ్రామాల్లో యురేనియం లభ్యత, పరిశోధన కోసం తవ్వకాలు లేవని ఎస్పీ తెలిపారు. యురేనియం తవ్వకాల గురించి వస్తోన్న వదంతులను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.