News May 18, 2024
ఆలూరు ఏడీఈపై సస్పెన్షన్ వేటు

ఆలూరు విద్యుత్ శాఖ ఏడీఈ నాగేంద్ర ప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల ముందు రోజు హాలహర్వి మండలంలో పలుచోట్ల విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. హొలగుంద మండలంలో ట్రాన్స్ఫార్మర్, స్తంభాల అనధికారిక ఏర్పాట్లు, మే 13న పలు పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం వరకు విద్యుత్ అసౌకర్యం నెలకొనడంతో పాటు విధి నిర్వహణలో అలసత్వం వహించడం, అవినీతికి పాల్పడడంతో ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు.
Similar News
News November 24, 2025
అర్జీలు స్వీకరించిన కర్నూలు కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఏ. సిరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.
News November 24, 2025
సైబర్ మోసాలపై అప్రమత్తం కావాలి: కర్నూలు ఎస్పీ

ATM డిపాజిట్ మెషిన్లు (CDM), PhonePe/UPIను ఉపయోగించి మోసగాళ్లు అక్రమ లావాదేవీలు జరిపిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ‘తెలియని వ్యక్తుల కోసం ATM CDMలో డబ్బు జమ చేయండి, PhonePe/UPI ద్వారా పంపండి, కమిషన్ ఇస్తాం’ అంటూ ప్రజలను మోసం చేస్తున్నట్లు చెప్పారు. ఇవి మనీ లాండరింగ్ & సైబర్ నేరాల కిందికి వస్తాయన్నారు. వాటిలో పాల్గొనేవారు కూడా నేరస్థులే అన్నారు.