News May 18, 2024

ఆలూరు ఏడీఈపై సస్పెన్షన్ వేటు

image

ఆలూరు విద్యుత్ శాఖ ఏడీఈ నాగేంద్ర ప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల ముందు రోజు హాలహర్వి మండలంలో పలుచోట్ల విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. హొలగుంద మండలంలో ట్రాన్స్‌ఫార్మర్, స్తంభాల అనధికారిక ఏర్పాట్లు, మే 13న పలు పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం వరకు విద్యుత్ అసౌకర్యం నెలకొనడంతో పాటు విధి నిర్వహణలో అలసత్వం వహించడం, అవినీతికి పాల్పడడంతో ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు.

Similar News

News December 13, 2024

సకాలంలో పన్నులు వసూలు చేయాలి: కేఎంసీ కమిషనర్

image

నగరపాలక సంస్థకు సంబంధించి ఆస్తి, నీటి పన్నులను సకాలంలో వసూలు చేయాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, అడ్మిన్లతో సమావేశం నిర్వహించారు. అందరూ సమన్వయం చేసుకొని, పన్ను బకాయిలను త్వరగా త్వరితగతిన వసూలు చేయాలని ఆదేశించారు. రోజువారీ ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.

News December 12, 2024

ప్ర‌జ‌లంద‌రూ సోద‌ర భావంతో జీవించాలి: మాజీ ఎంపీ టీజీ

image

కుల‌, మ‌త బేధాలు లేకుండా ప్ర‌జ‌లంద‌రూ సోద‌ర భావంతో జీవించాల‌ని మాజీ రాజ్య‌స‌భ‌ స‌భ్యులు టీజీ వెంక‌టేశ్ అన్నారు. కర్నూలులోని మౌర్య ఇన్‌లో మంత్రి టీజీ భ‌ర‌త్ ఆధ్వ‌ర్యంలో పాస్ట‌ర్‌ల‌కు ఏర్పాటు చేసిన‌ క్రిస్మ‌స్ క్యాండిల్ లైట్ స‌ర్వీస్ కార్య‌క్ర‌మంలో వెంక‌టేశ్ పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా కర్నూలు నగరం నిలుస్తోందని ఆయన అన్నారు.

News December 12, 2024

ISPL: అక్షయ్ కుమార్‌ టీమ్‌లో కర్నూలు కుర్రాడు

image

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL)కు కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్ల గ్రామానికి చెందిన హనుమంత్ రెడ్డి ఎన్నికయ్యారు. హీరో అక్షయ్ కుమార్‌కు చెందిన శ్రీనగర్ మహావీర్ టీమ్ హనుమంత్ రెడ్డిని బేస్ ప్రైజ్ రూ.3 లక్షలకు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది జనవరి 26 నుంచి ఫిబ్రవరి 14 వరకు ముంబైలో ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 6 జట్లు పాల్గొననుండగా హైదరాబాద్ టీమ్‌ను హీరో రామ్ చరణ్ కొనుగోలు చేశారు.