News March 27, 2025
ఆలూరు సాంబ శివారెడ్డికి వైఎస్ జగన్ కీలక బాధ్యతలు

శింగనమల నియోజకవర్గ వైసీపీ నాయకుడు ఆలూరు సాంబ శివారెడ్డికి వైసీపీ కీలక పదవి కట్టబెట్టింది. ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్‌గా నియమిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవి ఇచ్చిన అధినేతకు సాంబ శివారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తన మీద జగన్ ఉంచిన నమ్మకంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు.
Similar News
News September 17, 2025
రజాకార్లకు వణుకు పుట్టించిన ఐలమ్మ..!

భూమికోసం విస్నూరు దేశ్ ముఖ్ రాపాక రాంచంద్రారెడ్డితో వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ప్రపంచ స్థాయిలో ఇప్పటికీ గుర్తుండిపోయింది. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిని విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ఆ రోజుల్లో రజాకార్లకు వెన్నులో వణుకు పుట్టించింది. జనగామ జిల్లా పాలకుర్తిలో 1945లో ఆంధ్ర మహాసభ ఏర్పాటై, రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికింది.
News September 17, 2025
మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించింది ఇక్కడే..!

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు మహిళలు నగ్నంగా ఆడి పాడాలని రజాకార్ల పాలనలో విస్నూరు దొర ఆదేశించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూరు గ్రామంలో అలాంటి ఆకృత్యాలకు సాక్ష్యంగా ఇప్పటికీ అక్కడ విస్నూరు గడి కనిపిస్తోంది. విస్నూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి అరాచకాలకు కేంద్రబిందువే ఈ గడి. మాట వినని వారిని రజాకారులతో ఈ గడికి తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టేవారు.
News September 17, 2025
నల్గొండ: రాచకొండల్లో ‘పెళ్లిగుట్ట’.. స్టోరీ ఇదే

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాచకొండ గుట్టలు కమ్యూనిస్టు గెరిల్లా దళాలకు కేంద్రంగా ఉండేవి. రామన్నపేట, భువనగిరి ప్రాంతాల్లో ప్రజా పోరాటాలు నిర్వహించే వెంకటనర్సింహారెడ్డి, కృష్ణమూర్తి నాయకత్వంలోని గెరిల్లా దళాలు రక్షణ కోసం రాచకొండకు చేరాయి. గెరిల్లా దళ నేత కృష్ణమూర్తి వివాహం రాచకొండలోనే జరిగింది. ఆనాడు వివాహం నిర్వహించిన గుట్టను ఇప్పటికీ ‘పెళ్లి గుట్ట’గా పిలుస్తుంటారు.