News October 29, 2024

ఆలేరు: బ్రెయిన్ డెడ్‌తో మృతి.. మరికొందరికి పునర్జన్మ

image

తాను చనిపోతూ పది మందికి అవయవ దానం చేసి మానవత్వన్ని చాటుకున్న ఘటన ఆలేరు మండలంలో చోటు చేసుకుంది. ఆలేరు మండల కేంద్రానికి చెందిన జూకంటి కుమార్ గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొదుతూ మంగళవారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు జీవన్‌దాన్ సంస్థ ద్వారా అవయవాలను దానం చేశారు.

Similar News

News November 13, 2025

ఐదుగురు వ్యక్తులు గ్రామస్థులతో కలిసి దాడి చేశారు: FRO

image

చందంపేట మండలం గువ్వలగుట్ట తండాలో నిన్న జరిగిన దాడిపై ఫారెస్ట్ రేంజ్ అధికారి భాస్కర్ గురువారం కీలక విషయాలు వెల్లడించారు. అటవీ భూమిలో సాగు చేస్తున్న గిరిజనులను హక్కు పత్రాలు చూపాలని కోరామన్నారు. కొన్నేళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామని వాగ్వాదానికి దిగి ఐదుగురు వ్యక్తులు గ్రామస్థులతో కలిసి రాళ్ళు, కర్రలతో దాడి చేసి గాయపరిచారని చెప్పారు.

News November 13, 2025

NLG: నిర్దిష్ట లక్ష్యంతోనే పనులు: DRDO

image

జిల్లాలో చేపట్టిన జల్ సంచయ్, జల్ భాగీదారి కార్యక్రమం చేపట్టిన పనులకు కేంద్ర జలశక్తి శాఖ పురస్కారం ప్రకటించడం సంతోషంగా ఉందని DRDO పీడీ శేఖర్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచనలతో తాము ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ఈ పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేశామన్నారు. నీటి వనరుల కొరత ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీటిని సంరక్షించడంతో పాటుగా, భూగర్భజలాలు పెంచడమే కేంద్రంగా ఈ పనులు గుర్తించి నిర్వహించామన్నారు.

News November 13, 2025

NLG: ఇప్పుడే ఇలా.. చలితో కష్టమే..!

image

నల్గొండ జిల్లాలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. కొద్ది రోజుల క్రితం వరకు పగలు, రాత్రి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఒక్కసారిగా వాతావరణం మారడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. నవంబరు మొదట్లోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా రోజురోజుకు పడిపోతున్నాయి. మరోవైపు రోగులతో దవాఖానాలతో కిటకిటలాడుతున్నాయి.