News April 4, 2025
ఆల్ ఇండియా యూనివర్సిటీ క్రీడా పోటీలకు కోహెడ యువకుడు

ఆల్ ఇండియా యూనివర్సిటీ క్రీడా పోటీలకు కోహెడ యువకుడు ఎంపికయ్యడు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలానికి చెందిన హరి ప్రసాద్ సిద్దిపేటప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నాడు. చదువులతోపాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన హరి.. టగ్ ఆఫ్ వార్ యూనివర్సిటీ క్రీడలో పాల్గొని ఆల్ ఇండియా యూనివర్సిటీ క్రీడా పోటీలకు OU తరపున ఎంపిక అయ్యాడు. దీంతో యువకుడిని ప్రెండ్స్, అధ్యాపకులు అభినందిచారు.
Similar News
News December 17, 2025
పురుషుల ఖాతాల్లోకి రూ.10వేలు.. అధికారులకు తిప్పలు

బిహార్‌లో అధికారులకు కొత్త తంటాలు వచ్చి పడ్డాయి. మహిళలకు అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పథకం ద్వారా రూ.10వేలు జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని గ్రామాల్లో పొరపాటున ఈ డబ్బులు పురుషుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో వాటిని రికవరీ చేసేందుకు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా ఆ డబ్బు ఖర్చు చేసినట్లు వారు పేర్కొన్నారు. తాము డబ్బు ఇవ్వలేమని, తమను క్షమించాలని సీఎంను కోరుతున్నారు.
News December 17, 2025
గరిడేపల్లిలో 1042 ఓట్లతో కాంగ్రెస్ మద్దతుదారు విజయం

గరిడేపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య తన ప్రత్యర్థులపై 1042 ఓట్లతో మెజార్టీతో విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. తనను గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
News December 17, 2025
నేను పార్టీ మారలేదు.. స్పీకర్‌కు కడియం వివరణ

TG: తాను కాంగ్రెస్‌లో చేరలేదని, పార్టీ మారాననేది పచ్చి అబద్ధం అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు తెలిపారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై కడియంకు నోటీసులు ఇవ్వగా రెండు రోజుల క్రితం ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తాజాగా ఐదుగురు ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల కేసులో క్లీన్‌చిట్ ఇవ్వడంతో కడియం రిప్లై బయటకు వచ్చింది. అటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ రేపు నిర్ణయం తీసుకోనున్నారు.


