News March 1, 2025
ఆల్ ది బెస్ట్.. పరీక్షలు బాగా రాయండి: మంత్రి సత్యకుమార్

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా ఎలాంటి ఒత్తిడికిలోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మీ వెంట ఉంటాయని ట్వీట్ చేశారు. నిబద్ధత, క్రమశిక్షణ, అభ్యాసం ద్వారా ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News November 17, 2025
హైదరాబాద్ బస్తీలకు కదిలే అంగన్వాడీలు!

కదిలే గ్రంథాలయం, మూవింగ్ ఫుడ్ కోర్ట్ విన్నాం కానీ.. కదిలే అంగన్ వాడీ కేంద్రం విన్నారా..? లేదు కదా..! త్వరలో చూస్తారు కూడా. నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో మూవింగ్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 37 అధునాతన వాహనాలను కూడా సిద్ధం చేసిందని సమాచారం. అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సలహాలు ఇస్తారు.

ఇతిహాసాలు క్విజ్ – 69 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: శివుడికి ‘నీలకంఠుడు’ అని ఎందుకు అంటారు?
సమాధానం: పాల సముద్రాన్ని మథించేటప్పుడు భయంకరమైన విషం వెలువడింది. దాన్ని హాలాహలం అని అంటారు. సమస్త లోకాల సంరక్షణ కోసం శివుడు ఆ విషాన్ని తన కంఠంలో (గొంతులో) ఉంచుకుంటాడు. అందువల్ల ఆయన గొంతు నీలం రంగులోకి మారింది. అలా శివుడు నీలకంఠుడు అయ్యాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>