News March 1, 2025
ఆల్ ది బెస్ట్.. పరీక్షలు బాగా రాయండి: మంత్రి సత్యకుమార్

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా ఎలాంటి ఒత్తిడికిలోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మీ వెంట ఉంటాయని ట్వీట్ చేశారు. నిబద్ధత, క్రమశిక్షణ, అభ్యాసం ద్వారా ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News March 1, 2025
మహిళల కోసం కొత్త కార్యక్రమాలు.. అధ్యయనానికి కమిటీ: మంత్రి

TG: దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణపై సచివాలయంలో సమీక్షించారు. రాష్ట్రంలో మహిళల కోసం అమలవుతోన్న పథకాలపై చర్చించారు. మహిళా సాధికారత కోసం కొత్త కార్యక్రమాలు, ఇతర రాష్ట్రాల మహిళా సంక్షేమ విధానాల అధ్యయనం కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
News March 1, 2025
VZM: 16 మంది మందుబాబులకు షాక్..!

మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై భారీగా జరిమానాలు పడుతున్నాయి. SP వకుల్ జిందల్ ఆదేశాలతో విజయనగరం పట్టణ ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 16 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. పట్టుబడ్డ వారిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి పదివేలు చొప్పున 16 మందికి రూ.1.60 లక్షల జరిమానాను విధించారని SP శనివారం తెలిపారు. ప్రమాదాలు నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు.
News March 1, 2025
HIGH ALERT: ఈ ఎండా కాలం అంత ఈజీ కాదు

TG: ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా APR, MAYలో 44-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. దక్షిణ, మధ్య తెలంగాణ, HYD పరిసర ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందంది. 1901-2025 సగటు ఉష్ణోగ్రత తీసుకుంటే ఈ ఏడాదే తీవ్రత అధికమని పేర్కొంది.