News March 6, 2025
ఆళ్లగడ్డలో ఉచితంగా ‘ఛావా’ చిత్రం ప్రదర్శన

ఛత్రపతి శివాజీ కొడుకు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా‘ చిత్రం ఆళ్లగడ్డలోని రామలక్ష్మి థియేటర్‌లో నేడు ఉచితంగా ప్రదర్శించనున్నారు. మధ్యాహ్నం నుంచి 3 షోలు ప్రదర్శిస్తున్నామని థియేటర్ ప్రొప్రైటర్ అట్లా దిలీప్ కుమార్ రెడ్డి తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా థియేటర్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్క హిందూ సోదరులు సినిమాను చూడాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News February 23, 2026
కామారెడ్డి జిల్లాలో వాతావరణ వివరాలు..

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో విభిన్న వాతావరణం నెలకొంది. మధ్యాహ్న సమయంలో ప్రజలు ఉక్కపోతకు గురవ్వగా, రాత్రి అక్కడక్కడ వర్షపాతం నమోదయింది. అధికారుల వివరాల ప్రకారం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత బీబీపేట 24.4°C , అత్యల్ప ఉష్ణోగ్రత సర్వాపూర్ 20.6°C లుగా నమోదయ్యాయి. కాగా పిట్లం లో 16మి.మీ, జుక్కల్ 7.8, సోమూర్ 4.8, సర్వాపూర్ 4.5, బిచ్కుంద 3.3, మక్దూంపూర్ 2.8, మేనూరు 2.5మి.మీ వర్షపాతం నమోదయింది.
News February 23, 2026
నాగర్‌కర్నూల్ ఘటన.. NHRCకి ఫిర్యాదు

నాగర్‌కర్నూల్ కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష కారణంగా 2నెలల పసికందు మృతిచెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు అందింది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం కమ్మగూడెంకు చెందిన న్యాయవాది వినోద్ ఈ ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు. కులవివక్ష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.
News February 23, 2026
జనగామ: కొబ్బరి చెట్టుపై నుంచి పడి యువకుడు మృతి

చిల్పూర్ మండలం ఫతేపూర్ గ్రామ పరిధిలోని లూనావత్ తండాకు చెందిన గూగులోత్ సురేశ్ (24) ఆదివారం సాయంత్రం కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరి బొండాలు తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి భార్య అక్షర 8 నెలల గర్భిణి కావడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.


