News July 19, 2024
ఆళ్లగడ్డలో జబర్దస్త్ నటుడు సద్దాం సందడి

ఆళ్లగడ్డలో ప్రముఖ హాస్య నటుడు జబర్దస్త్ సద్దాం శుక్రవారం సందడి చేశారు. పట్టణానికి విచ్చేసిన సద్దాంతో జనసేన నాయకుడు మాబు హుస్సేన్ భేటీ అయ్యారు. సద్దాం మాట్లాడుతూ.. తన సొంతగడ్డ ఆళ్లగడ్డలో జన సైనికులను కలవడం ఆనందంగా ఉందన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జబర్దస్త్ టీంతో కలిసి తన వంతు ప్రచారం చేశానన్నారు. నేడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు.
Similar News
News September 14, 2025
కర్నూలు: ‘ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలి’

ప్రతి ఒక్కరు వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ‘సండేస్ ఆన్ సైక్లింగ్’ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్ వల్ల పర్యావరణానికి ముప్పు ఉండదని, ప్రతి ఆదివారం పోలీసులు సైకిల్ తొక్కాలని పిలుపునిచ్చారు.
News September 14, 2025
కర్నూలు జిల్లా MPకి 15వ ర్యాంక్

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు 15వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్సభలో మొత్తం 70 ప్రశ్నలు అడగటంతోపాటు 7 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు శాతం 91.18గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.
News September 14, 2025
ఉల్లి కొనుగోలు ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష

కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి ఉత్పత్తులను కలెక్టర్ సిరి శనివారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ నవ్యతో కలిసి ఎగుమతుల పరిస్థితి, కొనుగోలు ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉల్లి కొనుగోలు విషయంలో ఆలస్యం లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర తప్పనిసరిగా చెల్లించాలన్నారు.