News April 15, 2025
ఆళ్లగడ్డలో టీడీపీ నేతపై దుండగుల దాడి

ఆళ్లగడ్డలో టీడీపీ నేత సింగం భరత్ రెడ్డిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. నాలుగు రోడ్ల సెంటర్‌లో కర్రలతో కిరాతకంగా కొట్టడంతో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నంద్యాలకు తీసుకెళ్లారు. గేటు వసూళ్ల విషయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 17, 2025
కోడుమూరు: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

కోడుమూరు మండలం వర్కూరు గ్రామం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గురువారం రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెల్తుర్ధి మండలం శ్రీరంగపురానికి చెందిన వెంకటరాముడి మృతి చెందాడు. ఇరు బైక్‌ల మీద ఉన్న అరవింద్, వేణులు, బదినేహాల్ వాసులు షాషావలి, దాదపీరాలు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం కర్నూలు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News April 17, 2025
వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా?

వేసవి సెలవుల్లో పిల్లలను విహార యాత్రలకు తీసుకెళ్లేందుకు పేరెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. రొటీన్ లైఫ్ నుంచి వెరైటీ కోరుకునే వారికి మన జిల్లాలో ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అవి.. శ్రీశైలం, మహానంది, అహోబిలం, మంత్రాలయం, యాగంటి, ఎల్లార్తి దర్గా, నందవరం చౌడేశ్వరి దేవి దేవాలయం, బెలుం గుహలు, ఓర్వకల్ రాక్ గార్డెన్, సంగమేశ్వర ఆలయం, సన్ టెంపుల్, ఓంకారం క్షేత్రం.
News April 17, 2025
కర్నూలు: అక్షరాస్యతకై ‘ఉల్లాస్’ కార్యక్రమం

వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన ఉల్లాస్ పథకాన్ని క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేయాలని అధికారులను డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ ఆదేశించారు. బుధవారం కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్‌లో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో “ఉల్లాస్” కార్యక్రమంపై జిల్లాస్థాయి కన్వర్జెన్సీ కమిటీ సమావేశాన్ని డీఆర్వో నిర్వహించారు. కార్యక్రమం అమలుపై అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.