News December 16, 2024
ఆళ్లగడ్డలో మంచు మనోజ్ కీలక ప్రకటన చేస్తారా?
హీరో మంచు మనోజ్, భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. నేడు శోభా నాగిరెడ్డి జయంతి కావడంతో ఆళ్లగడ్డలోని భూమా ఘాట్‌లో నివాళి అర్పించిన అనంతరం రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఓ పార్టీలో చేరి నంద్యాల నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ చేస్తారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మనోజ్ దంపతులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Similar News
News January 13, 2025
ప్రజలకు నంద్యాల జిల్లా ఎస్పీ సూచనలు
సంక్రాంతి పండుగ జిల్లా ప్రజలందరి జీవితాలలో నూతన కాంతులు, సంతోషాలు నింపాలని నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుతో సంతోషంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భోగి, మకరసంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.
News January 13, 2025
ఆళ్లగడ్డ సచివాలయ ఉద్యోగికి డాక్టరేట్
ఆళ్లగడ్డలో వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చాగలమర్రికి చెందిన డా.మౌలాలి డాక్టరేట్ పొందారు. అర్థశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.గణేశ్ నాయక్ పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ ప్రాక్టీసెస్ ఇన్ సెలెక్టెడ్ ఇండస్ట్రీస్ ఆఫ్ కర్నూల్ డిస్త్రీక్ట్’ అనే అంశంపై పరిశోధన చేశారు. వైవీయూ పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య కేఎస్‌వీ కృష్ణారావు డాక్టరేట్‌ను జారీ చేశారు.
News January 13, 2025
2018లోనే గ్రీన్‌కో ప్రాజెక్ట్‌కు ఆమోదం: TG
పిన్నాపురం గ్రీన్‌కో ప్రాజెక్టును జగన్ ప్రారంభించారని YCP నేతలు పేర్కొన్నారు. దీనిపై మంత్రి TG భరత్ స్పందించారు. ‘2018లోనే TDP ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ రావడానికి జగన్ కృషే కారణమని కొందరు చెప్పడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజానికి జగన్ తన పదవీ కాలంలో కొన్నేళ్ల పాటు ఈ ప్రాజెక్టును నిలిపివేశారు. ఇకనైనా ప్రజలను తప్పుదారి పట్టించడం మానేయాండి’ అని మంత్రి అన్నారు.