News September 3, 2024
ఆళ్లగడ్డలో 85 గొర్రెలు సజీవ దహనం

ఆళ్లగడ్డలోని బృందావన్ కాలనీ వెంచర్ సమీపంలో సోమవారం రాత్రి ఘోరం జరిగింది. ప్రమాదవశాత్తు గుడిసె కాలిపోవడంతో అందులోని 85 గొర్రెలు సజీవ దహనం అయ్యాయి. రాత్రి 10:30 గంటల సమయంలో గొర్రెలకు దోమలు కుట్టకుండా గొర్రెల యజమాని మిట్టపల్లి కృష్ణయ్య పొగ పెట్టడంతో ప్రమాదవశాత్తు గుడిసె అంటుకుంది. అందులో ఉన్న 85 గొర్రెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. రూ.లక్షల్లో ఆస్తి నష్టం సంభవించింది.
Similar News
News December 18, 2025
ప్రతి పాఠశాలలో వారం రోజులు వేడుకలు: డీఈవో

కర్నూలు జిల్లాలో ఈనెల 18 నుంచి 24 వరకు అన్ని ఉన్నత పాఠశాలల్లో జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.సుధాకర్ తెలిపారు.19న ఏపీజే అబ్దుల్ కలాం మునిసిపల్ హైస్కూల్లో 8, 9వ తరగతి విద్యార్థులకు డ్రాయింగ్, ఎలక్యూషన్ పోటీలు జరగనున్నాయి. విజేతలకు రూ.5 వేల వరకు బహుమతులు అందజేస్తారు.
News December 17, 2025
‘జిల్లాలో రబీకి యూరియా కొరత లేదు’

కర్నూలు జిల్లాలో రబీ సీజన్కు యూరియా ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి. వరలక్ష్మి తెలిపారు. జిల్లాకు మొత్తం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 8,487 మెట్రిక్ టన్నుల స్టాక్ అందుబాటులో ఉండగా, డిసెంబర్ చివరికి మరింత యూరియా రానుందని చెప్పారు. రైతులు ఎంఆర్పీ ధరలకే ఎరువులు కొనుగోలు చేసి రశీదు తీసుకోవాలని సూచించారు.
News December 17, 2025
ఈనెల 21న పల్స్ పోలియో: జేసీ

ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేసి, ఐదేళ్లలోపు ప్రతీ చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని జేసీ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 3.52 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా 1,600 బూత్లు, మొబైల్ యూనిట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా ఇంటింటి సర్వే, ట్రాన్సిట్ పాయింట్లలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.


