News September 3, 2024

ఆళ్లగడ్డలో 85 గొర్రెలు సజీవ దహనం

image

ఆళ్లగడ్డలోని బృందావన్ కాలనీ వెంచర్ సమీపంలో సోమవారం రాత్రి ఘోరం జరిగింది. ప్రమాదవశాత్తు గుడిసె కాలిపోవడంతో అందులోని 85 గొర్రెలు సజీవ దహనం అయ్యాయి. రాత్రి 10:30 గంటల సమయంలో గొర్రెలకు దోమలు కుట్టకుండా గొర్రెల యజమాని మిట్టపల్లి కృష్ణయ్య పొగ పెట్టడంతో ప్రమాదవశాత్తు గుడిసె అంటుకుంది. అందులో ఉన్న 85 గొర్రెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. రూ.లక్షల్లో ఆస్తి నష్టం సంభవించింది.

Similar News

News September 17, 2024

ప్రతి విద్యార్థి చేత ఆల్బెండజోల్ మాత్రలు మింగించండి: కలెక్టర్

image

జాతీయ నులిపురుగుల దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి విద్యార్థి చేత ఆల్బెండజోల్ మాత్రలను మింగించాలని కలెక్టర్ రాజకుమారి ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం నంద్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించే నులిపురుగుల నివారణ మాత్రలు మింగించే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రతి గురువారం పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చే ఐరన్ పోలీక్ ఆసిడ్ మాత్రలను తప్పనిసరిగా మింగాలని ఆమె తెలిపారు.

News September 17, 2024

మొక్క నాటిన డ్వామా పీడీ

image

‘ఏక్ పేడ్ మాకే నామ్’లో భాగంగా జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ రామచంద్రా రెడ్డి చాగలమర్రిలోని మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణంలో మొక్క నాటారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మ పేరుతో మొక్క నాటాలని, చెట్లు పెంచాలన్న ప్రధాని పిలుపు మేరకు మొక్కలు నాటుతున్నామన్నారు. నవమాసాలు మోసి పెంచిన అమ్మకు గుర్తుగా చెట్టు నాటాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ నిర్మల, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

News September 17, 2024

పేదింటి రైతు బిడ్డకు ఎంబీబీఎస్ సీటు

image

క్రిష్ణగిరి మండలం కంబాలపాడుకు చెందిన దూదేకుల రంజిత్ కర్నూలు మెడికల్ కాలేజీలో సీటు సాధించాడు. తల్లిదండ్రులు రెహమాన్, మహబూబ్ బీ వ్యవసాయం చేసుకుంటూ జీవినం సాగిస్తున్నారు. తన కుమారుడు రంజిత్ నీట్‌లో 582/720 మార్కులు సాధించి మొదట విడత కౌన్సెలింగ్‌లోనే సీటు సాధించాడని ఆనందం వ్యక్తం చేశారు. రంజిత్‌ను పలువురు అభినందించారు.