News January 5, 2025

ఆళ్లగడ్డ: యువకుడి ఆత్మహత్య

image

ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లి గ్రామానికి చెందిన శివపుల్లయ్య కుమారుడు మల్లికార్జున(25) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత నెల10న ఇంటిలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చికిత్సకై తరలించగా కోలుకోలేక ఆదివారం మృతి చెందాడు. వ్యవసాయంలో నష్టాలు రావడం, చదువుకున్నా నిరుద్యోగిగా మిగిలిపోవడంతో మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News January 26, 2025

కానిస్టేబుల్ అభ్యర్థులకు కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ శుభవార్త

image

కానిస్టేబుల్ అభ్యర్థులకు కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా శుభవార్త చెప్పారు. కానిస్టేబుల్ ఈవెంట్స్‌కు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు గైర్హాజరైన అభ్యర్థులు ఈనెల 27న హాజరుకావాలని పిలుపునిచ్చారు. నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఒరిజినల్, జిరాక్స్ ధ్రువపత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. 28వ తేదీతో అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షలు ముగుస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

News January 26, 2025

కర్నూలు: ‘ఆ హత్య దారుణం’

image

ఆలూరు మండలం అరికెర గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ హత్య అత్యంత అమానుషమైన చర్య అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బీ.వీరశేఖర్ అన్నారు. దేవనకొండలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఫ్యాక్షన్ నుంచి సామాన్య ప్రజానీకం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, ఇలా హత్యలు చేయడం తగదని అన్నారు.

News January 26, 2025

టికే ఆర్ శర్మ సేవలు చిరస్మరణీయం: డీవీఆర్

image

గాంధీయవాది టీకేఆర్ శర్మ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని క్లస్టర్ యూనివర్సిటీ ఉపకులపతి డీవీఆర్ సాయి గోపాల్ అన్నారు. శనివారం యూనివర్సిటీ ప్రాంగణంలో టీకేఆర్ శర్మ శతజయంతి ఉత్సవాల బ్రోచర్లను ఆయన విడుదల చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. శత జయంతి ఉత్సవాలను ఈనెల 30న కర్నూలులోని కేవీఆర్ కళాశాల ప్రాంగణంలో గాడిచర్ల ఫౌండేషన్, సాహితీ సదస్సు సంస్థ సంయుక్తా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు.