News April 19, 2024
ఆళ్ల నాని ఆస్తులు, అప్పులు ఎంతో తెలుసా..?

ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏలూరు వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా అఫిడవిట్‌లో చరాస్తులు రూ.1,39,96,885, స్థిరాస్తులు రూ.55,60,650 ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన సతీమణి పేరిట చరాస్తులు రూ.72,69,897, స్థిరాస్తులు రూ.5,92,29,200గా పొందుపరిచారు. అప్పులు ఆయన పేరిట రూ.27,51,846, భార్య పేరున రూ.9,45,100 ఉన్నాయన్నారు.
Similar News
News January 8, 2026
విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలి: జేసీ

డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం కింద జిల్లాలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని జేసీ రాహుల్ అన్నారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో జిల్లాస్థాయి స్టీరింగ్ కమ్ సమన్వయ కమిటీ సమావేశంలో జేసీ మాట్లాడారు. ప్రతినెల జిల్లా, మండల స్థాయి అధికారులు పాఠశాలలను సందర్శించాలన్నారు. నిర్దేశించిన మెనూ ప్రకారం ఎటువంటి మార్పులు లేకుండా విద్యార్థులకు సమతుల ఆహారాన్ని అందించాలన్నారు.
News January 8, 2026
ప.గో: యువకుడి ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం ఉండిలో చోటుచేసుంది. ఉండి శివారు ఉప్పగుంట వద్ద చేపల చెరువు వద్ద పనిచేస్తున్న దీప్ జ్యోతి బాస్మతి (21) చెరువు గట్టు మీద ఉన్న రేకుల షెడ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా మృతుడు తన తండ్రి సుకుమార్‌తో కలిసి ఉండిలో ఓ చేపలచెరువు వద్ద పనిచేస్తున్నాడు. మృతుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు SI నసీరుల్లా తెలిపారు.
News January 8, 2026
నేడు భీమవరంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు

భీమవరం డీఎన్ఆర్ స్వయం ప్రతిపత్తి కళాశాలలో గురువారం ప్రభుత్వ ఉద్యోగుల శాఖాపరమైన అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ పరీక్షకు సుమారు 100 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ఏర్పాటు చేయాలని సూచించారు.


