News April 9, 2025
ఆశావహ జిల్లాగా పార్వతీపురం మన్యం: కలెక్టర్

ఆశావహ జిల్లాగా పార్వతీపురం ఎంపిక అయినట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. వసతి గృహాల్లో చదివే విద్యార్థుల ఆరోగ్య ప్రమాణాలు మరింత మెరుగ్గా ఉండాలని సూచించారు. కుటుంబంలోని పిల్లల మాదిరిగా వసతి గృహ విద్యార్థులను ఆదరించాలని హితవు పలికారు. వసతి గృహాల్లో విద్యార్థులు చేరిన నాటి నుంచి ఆ విద్యార్థికి ప్రతి నెలా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.
Similar News
News April 24, 2025
నాగల్ గిద్ద: భూభారతి చట్టంతో రైతులకు మేలు: కలెక్టర్

భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. నాగల్ గిద్దలో భూభారతి చట్టంపై అవగాహన సమావేశం గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ చట్టంతో భూమికి సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు.
News April 24, 2025
రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై రాజధాని, రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు. మే 2న అమరావతి పర్యటనకు రావాలని ఆయనను ఆహ్వానిస్తారని సమాచారం.
News April 24, 2025
జగిత్యాల : మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు: జీవన్‌రెడ్డి

JGTL ఇందిరాభవన్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. మామిడి రైతులు మార్కెట్లో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రేడర్లు నిబంధనలు పాటించక, మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ లోపంతో రైతులపై భారం పడుతుందని తెలిపారు. కమీషన్ల దోపిడీ, నాణ్యత, గ్రేడింగ్ పేరుతో నష్టం, మౌలిక వసతుల లోపం వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.