News April 9, 2025

ఆశావహ జిల్లాగా పార్వతీపురం మన్యం: కలెక్టర్

image

ఆశావహ జిల్లాగా పార్వతీపురం ఎంపిక అయినట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. వసతి గృహాల్లో చదివే విద్యార్థుల ఆరోగ్య ప్రమాణాలు మరింత మెరుగ్గా ఉండాలని సూచించారు. కుటుంబంలోని పిల్లల మాదిరిగా వసతి గృహ విద్యార్థులను ఆదరించాలని హితవు పలికారు. వసతి గృహాల్లో విద్యార్థులు చేరిన నాటి నుంచి ఆ విద్యార్థికి ప్రతి నెలా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.

Similar News

News November 26, 2025

మూవీ అప్డేట్స్

image

* ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. రిలీజ్‌కు ముందే కేవలం తెలుగు స్టేట్స్‌లోనే రూ.130కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది.
*నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK111’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ హిస్టారికల్ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్‌లో నటిస్తారని టాక్.

News November 26, 2025

పెద్దపల్లి: జిల్లా కలెక్టర్‌తో రాణి కుముదిని VC

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆమె జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇందులో పాల్గొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, నోటిఫికేషన్ ప్రకటన, టీపోల్ అప్డేట్లు, ఎన్నికల నియమావళి అమలు పటిష్ఠంగా ఉండాలని కమిషనర్ సూచించారు.

News November 26, 2025

VZM: రేపు డయల్ యువర్ ఆర్టీసీ డీపీటీవో కార్యక్రమం

image

డయల్ యువర్ డీపీటీవో కార్యక్రమాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు విజయనగరం ఆర్టీసీ డిపో ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. కాంప్లెక్స్ డీపీటీవో కార్యాలయంలో ఉదయం 11 గంటలు నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీపీటీవో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. డిపో పరిధిలో గల ప్రయాణికులకు ఎటువంటి సమస్యలున్నా, సలహాలు ఉన్న నం.9959225604 ద్వారా తెలిపి నివృత్తి చేసుకోవాలని కోరారు.