News February 8, 2025

ఆశ్రమ పాటశాలల్లో పర్యటించిన అడిషనల్ కలెక్టర్

image

జైనూర్ మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికల పట్నాపూర్‌లో ఆకస్మికంగా పర్యటించారు. పాఠశాలను సందర్శించిన అసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి.. పాఠశాలలో అన్ని రికార్డులను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులకు మంచి మార్కులు సాదించేందుకు ఒక్క క్రమ పద్ధతిలో ప్రతీ ఒక్క సబ్జెక్టు తగు సమయం కేటాయించాలని సూచనలు చేశారు. 

Similar News

News November 15, 2025

తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు రాహుల్ అభినందన

image

తెలంగాణ సీఎం రేవంత్, PCC చీఫ్ మహేశ్, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఘన విజయం సాధించినందుకు రాహుల్ వారిని అభినందించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

News November 15, 2025

NGKL: రేపటి నుంచి అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ తరగతులు

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఓపెన్ డిగ్రీ విద్యార్థులకు ప్రథమ, తృతీయ, ఐదో సెమిస్టర్ తరగతులు NOV 16వ తేదీ ప్రారంభం కానున్నాయని కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్, సార్వత్రిక అధ్యయన కేంద్రం సమన్వయకర్త ఎం.అంజయ్య తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా తరగతులకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 15, 2025

స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశా: రానా

image

TG: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో సినీ నటుడు దగ్గుబాటి రానాను CID సిట్ విచారించింది. తన బ్యాంకు వివరాలను అధికారులకు రానా అందించారు. స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్‌ను మాత్రమే తాను ప్రమోట్ చేశానని సిట్‌కు తెలిపినట్లు రానా పేర్కొన్నారు. అన్నీ పరిశీలించాకే బెట్టింగ్ యాప్ సంస్థతో ఒప్పందం చేసుకున్నానని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే ఏ సంస్థతోనూ ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు.