News December 27, 2024
ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి: తమ్మినేని

ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ హామీని అమలు చేయకపోవడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆశ వర్కర్లు చేపట్టిన బస్సు యాత్ర ఖమ్మంకు చేరుకున్న నేపథ్యంలో వారికి తమ్మినేని సంఘీభావం తెలిపారు. ఆశా వర్కర్లకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.
Similar News
News December 3, 2025
స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పనిచేయాలి: సీపీ

ఖమ్మం జిల్లాలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పోలీసు సిబ్బంది పనిచేయాలని సీపీ సునీల్ దత్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విధులపై బుధవారం ఖమ్మం రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అప్పగించిన భాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలన్నారు. గ్రామాల్లో ఘర్షణ వాతావరణం లేకుండా పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని పేర్కొన్నారు.
News December 3, 2025
పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం: ఖమ్మం సీపీ

దట్టమైన పొగమంచు సమయాల్లో వాహన ప్రయాణం ప్రమాదకరమని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు నివారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారని, పొగమంచు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్టిలో పెట్టుకొని స్వల్ప నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
News December 3, 2025
పాలేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 20.5 అడుగులు

కూసుమంచి మండలం పాలేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 20.5 అడుగులకు చేరింది. ఈ సందర్బంగా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 20.5 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి జలాశయానికి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం నుంచి కింది కాల్వకు, తాగునీటికి నీటిని వినియోగిస్తున్నారు.


