News April 10, 2025

ఆసిఫాబాద్‌లో కొత్త తరహాలో పశువుల రవాణా

image

ఆసిఫాబాద్ జిల్లాలో కొత్త తరహాలో మూగజీవాలను కబేళాలకు తరలిస్తూ లక్షల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాలను పోలీసులు పట్టుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు కొత్త తరహాలో ఎవరికి అనుమానం రాకుండా ఒక వాహనంలో 2 పశువులను తరలిస్తే ఎవరికి అనుమానం రాదనే ఆలోచనతో తరలిస్తున్నారు. సోమవారం కాగజ్‌నగర్లో 13వాహనాల్లో 26 పశువులను పట్టుకున్నారు.

Similar News

News December 3, 2025

ట్రాఫిక్ మానిటరింగ్ తప్పనిసరి: ఎస్పీ

image

నేషనల్ హైవేపై ట్రాఫిక్ మానిటరింగ్ వ్యవస్థ తప్పని సరిగా ఉండాలని ఎస్పీ తుహీన్ సిన్హా అన్నారు. బుధవారం అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో హై వే, జీవీఎంసీ, ఆర్అండ్‌బీ అధికారులతో ఎస్పీ సమీక్షించి మాట్లాడారు. హైవేకు అనుబందంగా ఉన్న 11 పోలీస్ స్టేషన్‌లలో బ్లింకర్లు, ఇల్యూమినేషన్ లైట్స్, సోలార్ క్యాట్ ఐస్, సిగ్నల్ సైన్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.

News December 3, 2025

‘కాటన్ ష్రెడర్’తో పత్తి వ్యర్థాల సద్వినియోగం

image

పత్తి పంటలో వ్యర్థాల తొలగింపునకు కూలీల కొరత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ‘కాటన్ ష్రెడర్’ యంత్రం అందుబాటులో ఉంది. ఇది పత్తి మొక్క కాండాన్ని కత్తిరించి చిన్న ముక్కలుగా చేస్తుంది. ఈ ష్రెడర్ సాయంతో 3 గంటల్లో 1 హెక్టార్ భూమిలో పత్తి పంట వ్యర్థాలను తొలగించి ముక్కలుగా చేసి భూమిలో కలిపివేయవచ్చు లేదా పారిశ్రామిక అవసరాలకు వాడవచ్చు. పత్తి మొక్క కాండాలను భూమిలో కలపడం వల్ల భూసారం పెరుగుతుంది.

News December 3, 2025

‘కాటన్ ష్రెడర్‌’తో మరిన్ని ప్రయోజనాలు

image

కాటన్ ష్రెడర్‌తో తక్కువ ఇంధనంతోనే మొక్క కాండాలను చిన్న ముక్కలుగా చేయవచ్చు. పత్తి వ్యర్థాలను భూమిలో కలియదున్నడం వల్ల నేలసారం పెరగడంతో పాటు నీటిని నిల్వచేసుకునే సామర్థ్యం భూమికి పెరుగుతుంది. మట్టి సేద్యానికి అనువుగా, వదులుగా మారుతుంది. నేల కోతను తగ్గించవచ్చు. పత్తి వ్యర్థాలను భూమిలో కలియదున్నడం వల్ల గులాబీ పురుగు ఉద్ధృతిని చాలా వరకు తగ్గుతుంది. పంటకు మేలుచేసే సూక్ష్మజీవుల సంఖ్య వృద్ధి చెందుతుంది.