News April 10, 2025
ఆసిఫాబాద్‌లో కొత్త తరహాలో పశువుల రవాణా

ఆసిఫాబాద్ జిల్లాలో కొత్త తరహాలో మూగజీవాలను కబేళాలకు తరలిస్తూ లక్షల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాలను పోలీసులు పట్టుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు కొత్త తరహాలో ఎవరికి అనుమానం రాకుండా ఒక వాహనంలో 2 పశువులను తరలిస్తే ఎవరికి అనుమానం రాదనే ఆలోచనతో తరలిస్తున్నారు. సోమవారం కాగజ్‌నగర్‌లో 13వాహనాల్లో 26 పశువులను పట్టుకున్నారు.
Similar News
News April 23, 2025
నిర్మల్: INTER RESULTSలో అమ్మాయిలదే పైచేయి

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర జనరల్ ఫలితాల్లో బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. ప్రథమ సంవత్సరంలో బాలురు 43.54 శాతంతో ఉత్తీర్ణత సాధించగా బాలికలు 70.84 శాతం మంది పాసయ్యారు. సెకండియర్‌లో ఉత్తీర్ణత శాతం బాలురది 54.31గా ఉండగా బాలికలు 80.93గా సాధించారు. జిల్లాల మొత్తానికి ఫలితాల సాధనలో బాలికలదే పైచేయి సాధించారు.
News April 23, 2025
ASF: సివిల్స్‌లో మెరిసిన రైతుబిడ్డ

రైతుబిడ్డ సివిల్స్ ఫలితాల్లో మెరిసి ఔరా అనిపించారుడు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం బోదంపల్లికి చెందిన రాంటెంకి సోమయ్య-ప్రమీల దంపతుల కుమారుడు సుధాకర్ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా 949వ ర్యాంక్ సాధించారు. మారుమూల గ్రామీణ ప్రాంతంలోని రైతుబిడ్డ ఆల్ ఇండియా స్థాయిలో సివిల్స్ ర్యాంక్ సాధించడంపై జిల్లావాసులు అభినందించారు. జిల్లా బిడ్డకి మీరు CONGRATULATIONS చెప్పేయండి.
News April 23, 2025
MNCL: GRAEAT.. అస్మితకు 994 మార్కులు

రైతు బిడ్డ అస్మిత ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటి అందరి మన్ననలు పొందింది. దండేపల్లి మండలం గుడిరేవు గ్రామానికి చెందిన రైతు చిట్ల రమణ-సునీతల కూతురు అస్మిత ఇంటర్ సెకండియర్ ఎంపీసీ విభాగంలో 1000కి 994 మార్కులు సాధించి అందరికి ఆదర్శంగా నిలిచింది. అస్మిత లక్షెట్టిపేట ప్రభుత్వ వెల్ఫేర్ కాలేజీలో చదివి కళాశాల, తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చింది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజినీరింగ్ చేయడం తన లక్ష్యమని పేర్కొంది.