News September 24, 2024

ఆసిఫాబాద్‌లో సీనియర్ హ్యాండ్ బాల్ పోటీలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీనియర్ పురుషులు, మహిళల హ్యాండ్ బాల్ పోటీలను ఈ నెల25న ఆసిఫాబాద్‌లోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి కనపర్తి రమేశ్ తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 9గంటలకు హ్యాండ్ బాల్ కోచ్ అరవింద్‌కు రిపోర్ట్ చేయాలని సూచించారు.

Similar News

News October 9, 2024

రెబ్బెన: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికైన అక్కా చెల్లెళ్లు

image

రెబ్బెనకు చెందిన ఒకే కుటుంబంలోని అక్కా చెల్లెలు డీఎస్సీ-2024లో ఉపాధ్యాయ కొలువులు సాధించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. అక్క ప్రవళిక స్కూల్ అసిస్టెంట్‌గా, చెల్లెలు రష్మిక SGTకి ఎంపికయ్యారు. వీరి తండ్రి మల్లేష్ బార్బర్‌గా, తల్లి పద్మ కేజీబీవీలో సీఆర్టీగా పనిచేస్తున్నారు. తమ ఇద్దరు ఆడపిల్లలను ప్రయోజకులను చేయాలని కోరికతో కష్టపడి చదివించామని, వారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు.

News October 9, 2024

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: ADB కలెక్టర్

image

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, ఫేక్ మేసేజ్‌లు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు తీసి గ్రూపుల్లో పోస్టు చేసిన, ఫార్వర్డ్ చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాస్తవాలు తెలుసుకొని, ఒకటికి రెండుసార్లు వార్త సరైనదా, కాదా పరిశీలించుకుని ప్రచురించాలన్నారు.

News October 8, 2024

ADB, ASF, MNCL జిల్లాలను ఆ జాబితాలో చేర్చండి: CM రేవంత్

image

ఢిల్లీలో జరిగిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎం సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం.. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. వామపక్ష, తీవ్రవాద ప్రభావిత (ఎల్‌డబ్ల్యూఈ) జిల్లాల జాబితాలో నుంచి తొలగించిన ఆదిలాబాద్, మంచిర్యాల,ఆసిఫాబాద్ జిల్లాలను తిరిగి ఆ జాబితాలో చేర్చాలని అమిత్ షా ను రేవంత్ రెడ్డి కోరారు.