News February 7, 2025

ఆసిఫాబాద్‌ ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్

image

ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిల్లా విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న యాదయ్య దీర్ఘకాలిక సెలవు పెట్టడంతో ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

Similar News

News December 5, 2025

పంచాయతీ ఎన్నికలు.. తొలి విడతలో 395 స్థానాలు ఏకగ్రీవం

image

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 4,236 సర్పంచ్ స్థానాలకు గాను 395 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 స్థానాలు ఉన్నాయి. అటు సీఎం రేవంత్ నియోజకవర్గం కొడంగల్‌లో 26 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. ఓవరాల్‌గా 5 గ్రామాల్లో నామినేషన్లు దాఖలవ్వలేదు. మిగిలిన 3,836 స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. కాగా మూడో విడత ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది.

News December 5, 2025

వరంగల్ స్మార్ట్ సిటీ పనుల్లో జాప్యం.. సీఎం దృష్టి పెడతారా?

image

ఎంపీ ఎన్నికల సందర్భంగా వరంగల్ అభివృద్ధికి CM రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల్లో అనేక పనులు ఇంకా నిలిచిపోయాయి. మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణకు రూ.150 కోట్లు, భద్రకాళి చెరువు పూడికతీత, మాడ వీధులు, స్మార్ట్‌సిటీ పనులు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ డీపీఆర్ సహా మొత్తం రూ.6,500 కోట్ల ప్రాజెక్టులు పురోగతి లేక నిలిచాయి. ఔటర్, ఇన్నర్ రింగ్‌రోడ్లు, మేడారం, గిరిజన వర్సిటీకి నిధులు త్వరగా విడుదల చేయాలని కోరుతున్నారు.

News December 5, 2025

విశాఖ: నమ్మించి రూ.1.97 కోట్లు కాజేశారు

image

మహిళను నమ్మించి ఆన్‌లైన్‌లో రూ.1.97 కోట్ల పెట్టుబడి పెట్టించి మోసం చేసిన తండ్రి కొడుకును 1 టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. సదరం శివ, ప్రేమ సాగర్ అక్కయ్యపాలెంకు చెందిన రమ్య రాజాకు ఆశ చూపించి ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టించడంతో పాటు 75 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టించి డబ్బులు కాజేశారు. తన డబ్బులు ఇవ్వమని రమ్య అడగటంతో ఇబ్బందులకు గురి చేయాగా ఆమె పోలీసులును ఆశ్రయించారు