News February 7, 2025
ఆసిఫాబాద్ ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్

ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిల్లా విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న యాదయ్య దీర్ఘకాలిక సెలవు పెట్టడంతో ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
Similar News
News February 11, 2026
హుజురాబాద్‌లో 81.47% పోలింగ్ నమోదు

హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి 81.47% శాతం పోలింగ్ నమోదైంది. గత 2020ఎన్నికల్లో నమోదైన 77.8 శాతంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా తరలివచ్చారు. వృద్ధులు, మహిళలు, యువత ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించారు. పోలింగ్ శాతం పెరగడం ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగినట్లు సూచిస్తోందని అధికారులు తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా పూర్తయ్యాయని చెప్పారు.
News February 11, 2026
కరీంనగర్: ‘అభ్యర్థి సస్పెన్షన్ వార్తల్లో నిజం లేదు’

కరీంనగర్ నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 242వ బూత్‌లో ఓ అభ్యర్థిని రిటర్నింగ్ అధికారి సస్పెండ్ చేశారంటూ సాగుతున్న ప్రచారపై కమిషనర్ ప్రపుల్ దేశాయ్ వివరణ ఇచ్చారు. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, రిటర్నింగ్ అధికారి ఎవరిని సస్పెండ్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు వార్తలను నమ్మవద్దని, పోలింగ్ ప్రక్రియ సజావుగానే సాగిందని తెలిపారు.
News February 11, 2026
జగిత్యాల: 2 రోజుల పాటు ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాలకు సెలవు

జగిత్యాల ఎస్‌కేఎన్‌ఆర్ ప్రభుత్వ సైన్స్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశాల మేరకు 12, 13 ఫిబ్రవరి 2026 తేదీలలో కళాశాలకు సెలవులు ప్రకటించినట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ.అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా బోధనా, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు గమనించాలని, సంబంధిత సమాచారాన్ని విద్యార్థులకు తప్పనిసరిగా తెలియజేయాలని సూచించారు.


