News March 31, 2025
ఆసిఫాబాద్: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్ను తేల్చనుంది. ఆసిఫాబాద్ జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.
Similar News
News November 21, 2025
JNTU అభివృద్ధికి సహకరించండి: VC

80 ఎకరాల్లో విస్తరించి ఉన్న కూకట్పల్లి జేఎన్టీయూ ప్రాపర్టీ టాక్స్తో పాటు లీజు చెల్లింపులు లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను వర్సిటీ వీసీ కిషన్ కుమార్ రెడ్డి కోరారు. ఎంతో మంది విద్యార్థులను JNTU తీర్చి దిద్దిందని, ఎంతో మందికి జీవితాన్నించిందని వెల్లడించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పెండింగ్లో ఉన్న నిధులు విడుదల చేసి అభివృద్ధికి తోడ్పాటునందించాలని విజ్ఞప్తి చేశారు.
News November 21, 2025
మొగల్తూరులో సినిమా హాల్ పరిశీలించిన జేసీ

మొగల్తూరులోని శ్రీదేవి జానకి థియేటర్ను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పేరు మార్పుపై వచ్చిన విషయంపై థియేటర్ను సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రేక్షకుల సౌకర్యం కోసం యాజమాన్యానికి పలు సూచనలు చేశామన్నారు. థియేటర్లో ఎగ్జిట్ బోర్డులు, ఫైర్ సేఫ్టీ, తాగునీరు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ధియేటర్ సిబ్బందికి సూచించారు.
News November 21, 2025
25న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. ఎన్నికలే అజెండా!

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ ఈ నెల 25న భేటీ కానుంది. పంచాయతీ ఎన్నికలే అజెండాగా మంత్రివర్గం సమావేశం కానున్నట్లు సమాచారం. ఎలక్షన్స్ నోటిఫికేషన్, పోలింగ్ తేదీలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా వచ్చే నెల 11, 14, 17 తేదీల్లో నిర్వహించాలని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మొదట సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ జరగనున్నాయి.


