News March 31, 2025
ఆసిఫాబాద్: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. ఆసిఫాబాద్ జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.
Similar News
News April 17, 2025
ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రికి ఘన స్వాగతం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో తమ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం సాయంత్రం ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రి జోషికి నంద్యాల, కర్నూలు ఎంపీలు బైరెడ్డి శబరి, నాగరాజు,పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, టీజీ వెంకటేష్, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘన స్వాగతం పలికారు. పిన్నాపురంలోని గ్రీన్ కో ప్రాజెక్ట్, అహోబిలంలో ఆయన పర్యటించనున్నారు.
News April 17, 2025
ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించండి: కలెక్టర్

జిల్లాలో బడి ఈడు పిల్లలందర్నీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి అక్కడే విద్యనభ్యసించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులు, మండల, నియోజకవర్గ స్పెషల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో ఎంఈఓలు, తహశీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, ఆర్డీవోతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
News April 17, 2025
ఈ-వేస్ట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి: కలెక్టర్

మున్సిపాలిటీలతోపాటు అన్ని మండలాల్లోఈ నెల 19 నాటికి ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలు, ఈఓపిఆర్డిలతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై సమీక్షించారు. 13 శాఖలు భాగస్వామ్యం కావాలని ఆయా శాఖల పరంగా చేయవలసిన విధులు, అంశాలను వివరించారు.