News August 7, 2024

ఆసిఫాబాద్: గర్భిణులను వెంటాడుతున్న రక్తహీనత

image

ఆసిఫాబాద్ జిల్లాలోని గర్భిణుల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత రెండేళ్లలో 10 మంది గర్భిణులు మృతిచెందారు. కాగా జిల్లాలో 3,939 మంది గర్భిణులు ఉండగా వారిలో 1,894 మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అంగన్వాడీల ద్వారా అందాల్సిన పోషకపదార్థాల్లో నాణ్యత లేకపోవడం, సక్రమంగా పంపిణీ కావడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారికి ప్రసవ సమయంలో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Similar News

News December 4, 2025

ADB: సీఎం పర్యటన.. ఎన్నికల స్టంట్ ఏనా..?

image

పంచాయతీ ఎన్నికల సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించడంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులకు సంబంధించి జిల్లాకు వస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాకు వచ్చి ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. అందుకే పట్టణంలో ఎన్నికల నియమావళి ఉండదని అక్కడ సీఎం సభ పెట్టారని మండిపడుతున్నారు.

నార్నూర్‌లో 6, గాదిగూడలో 4 సర్పంచ్‌లు ఏకీగ్రీవం

image

మొదటి విడుత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారంతో‌ ముగిసింది. నార్నూర్ మండలంలో మొత్తం 23 గ్రామపంచాయతీలకు గాను గంగాపూర్, జామ్డా, ఖంపూర్, మహాగావ్, మాన్కాపూర్, మాలేపూర్ మొత్తం 6 సర్పంచ్‌లు, 198 వార్డులకు గాను 157 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. గాదిగుడలో మొత్తం 4 గ్రామపంచాయతీలు, 196 వార్డులకు గాను 181 ఏకగ్రీవం అయినట్లు అధికారులు తెలిపారు.