News March 2, 2025
ఆసిఫాబాద్: గెలుపుపై ఎవరి అంచనాలు వారివే..

ఉమ్మడి ADB, KNR, MDK, NZB, పట్టభద్రుల, ఉపాధ్యాయ MLC ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీనేతల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ శ్రేణులతో కలిసి పోలింగ్ కేంద్రాల వారీగా ప్లస్, మైనస్‌లపై విశ్లేషిస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం, తదితర అంచనాలతో గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఈ ఫలితాలు వచ్చే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపనుండటంతో విద్యావంతుల తీర్పుపై రాజకీయపార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు గెలువు ఎవరిదో తేలనుంది.
Similar News
News March 23, 2025
భగ్గుమంటున్న వనపర్తి

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు కింది విధంగా ఉన్నాయి. అత్యధికంగా విలియంకొండ 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పెద్దమందడి 37.7, పెబ్బేరు 37.6, గోపాల్ పేట 37.5, దగడ 37.5, మదనాపూర్ 37.5, కానాయిపల్లి 37.4, ఆత్మకూర్ 37.2, కేతపల్లి 37.2, పానగల్ 37.1, రేమద్దుల 36.9, ఘన్పూర్ 36.7, వెలుగొండ 36.6, వనపర్తి 36.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 23, 2025
ఖమ్మం: రెండో రోజు 34 మంది విద్యార్థుల గైర్హాజరు

ఖమ్మం జిల్లాలో రెండో రోజు శనివారం పదో తరగతి హిందీ పరీక్షకు 34మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర శర్మ తెలిపారు. మొత్తం 16,386 మంది విద్యార్థులకు గాను 16,352మంది పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. ఎనిమిది పరీక్ష కేంద్రాలను డీఈవో, 37 పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేసినట్లు డీఈవో పేర్కొన్నారు.
News March 23, 2025
పెద్దపల్లి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా

పెద్దపల్లి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్‌లెస్ కేజీ రూ.180-200 ఉండగా.. విత్ స్కిన్ కేజీ రూ.150-170 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.130-150 మధ్య ఉంది. ఇక బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గతనెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా ప్రస్తుతం అమ్మకాలు పెరిగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఎండ తీవ్రతతో కోళ్ల మరణాల ఎక్కువ కావడంతో రేటు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.