News March 10, 2025
ఆసిఫాబాద్ జిల్లాకు రూ.200 కోట్లు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లాకు రూ.200 కోట్లు మంజూరయ్యాయి. దీంతో జిల్లాలో విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 23, 2025
లేటెస్ట్ సినిమా అప్డేట్స్

⭒ ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న సినిమాకు రూ.120 కోట్ల బడ్జెట్: సినీ వర్గాలు
⭒ ఈ నెల 28న నెట్ఫ్లిక్స్లోకి విష్ణు విశాల్ నటించిన ‘ఆర్యన్’ మూవీ
⭒ కమల్ నిర్మాణంలో రజినీ నటించబోయే సినిమాను ‘మహారాజ’ ఫేమ్ నిథిలన్ లేదా ‘పార్కింగ్’ ఫేమ్ రామ్ కుమార్ డైరెక్ట్ చేయనున్నట్లు టాక్
⭒ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు తొలుత ‘మాస్టర్ పీస్’ అనే టైటిల్ అనుకున్నాం: డైరెక్టర్ మహేశ్
News November 23, 2025
త్వరలో జిల్లా అంతటా పర్యటిస్తా: జీవన్ రెడ్డి

త్వరలో నిజామాబాద్ జిల్లా అంతటా పర్యటించి,స్థానిక పోరుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తానని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆపద కాలంలో పార్టీ కోసం పోరాడుతున్న గులాబీ శ్రేణులకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను గ్రామగ్రామాన ఎండగడతామని అన్నారు.
News November 23, 2025
మహబూబాబాద్ బిడ్డకు గోల్డ్ మెడల్

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం జాటోత్ తండాకు చెందిన క్రీడాకారిణి గుగులోతు ప్రియ ఒడిశాలో జరిగిన ఈఎంఆర్ఎస్ 4వ జాతీయ టైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చి పోటీ పడిన క్రీడాకారులను ఎదుర్కొని స్వర్ణ పతకంతో రాష్ట్రానికి పేరు తెచ్చిన ప్రియను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆమెకు ప్రశంసా పత్రాన్ని అందజేసిన సీఎం.. భవిష్యత్తులో మరిన్ని పథకాలను సాధించాలని ప్రోత్సహించారు.


