News March 10, 2025
ఆసిఫాబాద్ జిల్లాకు రూ.200 కోట్లు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లాకు రూ.200 కోట్లు మంజూరయ్యాయి. దీంతో జిల్లాలో విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News April 11, 2026
అల్లు అర్జున్ ‘రాకా’.. యాక్టర్ల రెమ్యునరేషన్ ఎంతంటే?

అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమాలో నటించేందుకు అల్లు అర్జున్ రూ.175కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఫీమేల్ లీడ్‌గా నటిస్తోన్న దీపికా పదుకొనె రూ.25కోట్లు, కీలక పాత్రలో నటిస్తోన్న రష్మిక రూ.5కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాను రూ.700కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇటీవల రిలీజ్ చేసిన అల్లు అర్జున్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
News April 11, 2026
బాపట్ల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్

బాపట్ల పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చిలో మున్సిపల్ పాలకవర్గం గడువు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు కలెక్టర్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
News April 11, 2026
హైదరాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌వే కోసం కసరత్తు

హైదరాబాద్-అమరావతి-మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే కోసం మూడు మార్గాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అమరావతి ఓఆర్ఆర్ మీదుగా 303.7 కి.మీ, విజయవాడ బైపాస్, ఓఆర్ఆర్ మీదుగా 293.19 కి.మీ, రాజధాని గుండా వెళ్లే 288.33 కి.మీ మార్గాలను అధ్యయనం చేస్తున్నారు. ఈ మూడింటిలో అనువైన ఒక మార్గాన్ని త్వరలో అధికారికంగా ఖరారు చేయనున్నారు.


