News May 25, 2024

ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ హత్య..?

image

ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. చింతలమానేపల్లి మండలం కోర్చిని గ్రామానికి చెందిన సదయ్యను కుమార్ అనే వ్యక్తి రాడ్‌తో తలపై కొట్టి హత్య చేసినట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

Similar News

News February 15, 2025

చెట్లను నరికివేస్తే.. సమాచారం ఇవ్వండి: ఆదిలాబాద్ DFO

image

అడవిలో లేదా రోడ్డు పక్కన, రెవెన్యూ, పట్టా, గైరాన్ భూముల్లో ఎవరైనా చెట్లను నరికివేస్తే, ఆ సమాచారం ఇచ్చిన వారికి తగిన పురస్కారాలు అందజేస్తామని డీఎఫ్ఓ ప్రశాంత్ పాటిల్ ప్రకటించారు. మానవ జీవనానికి ఎంతగానో ప్రయోజనకరంగా ఉండే చెట్లను కొందరు ఆర్థిక లబ్ది కోసం నరికేయడం విచారకరమన్నారు. చెట్ల నరికివేత, అడవుల్లో అగ్నిప్రమాదాలు, క్వారీల తవ్వకం లాంటి సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

News February 15, 2025

ఆదిలాబాద్: చోరీ కేసులో ఇద్దరు ARREST

image

ఈనెల 11న ఆదిలాబాద్‌లోని నటరాజ్ థియేటర్ వద్ద పాన్ షాప్‌లో చోరీ కేసులో ఇద్దరు నిందితులను వన్ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. CI సునీల్ తెలిపిన వివరాలు.. SI పద్మ NTR చౌక్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న మహాలక్ష్మీవాడకు చెందిన రతన్, వడ్డెర కాలనీకి చెందిన మల్లన్నను అదుపులోకి తీసుకుని విచారించారు. పాన్ షాప్‌లో చోరీ చేసినట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేశారు.

News February 15, 2025

ఆదిలాబాద్: అప్పు తీర్చలేక రైతు ఆత్మహత్య

image

ADB జిల్లా గుడిహత్నూర్ మండలం ఘర్కంపేట్ గ్రామానికి చెందిన మాధవ్ (53) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తట్టుకోలేక బుధవారం మధ్యాహ్నం పురుగుమందు తాగి ఇంటికి వచ్చాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు.

error: Content is protected !!